Crime News: మాస్కు పెట్టుకోలేదని గదిలోకి తీసుకెళ్లి, అఘాయిత్యానికి పాల్పడ్డ ప్రధానోపాధ్యాయుడు..!

హైదరాబాద్ మహానగరంలో దారుణం జరిగింది. కంచె చేను మేసిందన్న చందంగా మారింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే దారుణానికి పాల్పడ్డాడు. విద్యార్థినిపై ఓ ప్రధానోపాధ్యాయడు లైంగిక దాడికి తెగబడ్డాడు.

Crime News: మాస్కు పెట్టుకోలేదని గదిలోకి తీసుకెళ్లి, అఘాయిత్యానికి పాల్పడ్డ ప్రధానోపాధ్యాయుడు..!
rape case
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 30, 2021 | 8:15 AM

Hyderabad Minor Girl Raped: హైదరాబాద్ మహానగరంలో దారుణం జరిగింది. కంచె చేను మేసిందన్న చందంగా మారింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే దారుణానికి పాల్పడ్డాడు. విద్యార్థినిపై ఓ ప్రధానోపాధ్యాయడు లైంగిక దాడికి తెగబడ్డాడు. మాజీ ప్రధానోపాధ్యాయురాలి జోక్యంతో చివరికి ఏడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. శామీర్‌పేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థిని(15) తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 22న పాఠశాలకు వెళ్లింది. మాస్కు పెట్టుకోలేదనే కారణంతో తన గదిలోకి రావాల్సిందిగా విద్యార్థినిని ఆదేశించిన ప్రధానోపాధ్యాయుడు తర్వాత అత్యాచారానికి ఒడిగట్టాడు. పైగా, ఎవరికీ చెప్పొద్దని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాలిక భయపడి ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది. అయితే, అదే పాఠశాలలో గతంలో పనిచేసిన ప్రధానోపాధ్యాయురాలు బుధవారం కలిసిన సందర్భంలో బాలిక జరిగిన దారుణాన్ని ఆమెతో చెప్పింది. ఆమె ధైర్యం చెప్పడంతో బాలిక, ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌కుమార్‌ పేర్కొన్నారు.

కాగా, విషయం బయటికి రావడంతో సదరు ప్రధానోపాధ్యాయుడికి రాజకీయ నేతలు అండగా నిలిచారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిహారం ఇప్పిస్తామంటూ రాజీకి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.

Read Also…  Mohammed Fareeduddin: మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ నేత మొహమ్మద్‌ ఫరీదుద్దీన్‌ గుండెపోటుతో కన్నుమూత

ఒకే రోజు 2 రెండు హాఫ్ సెంచరీలు.. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్
ఒకే రోజు 2 రెండు హాఫ్ సెంచరీలు.. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్
నకిలీ ఖాతాతో అశ్విన్ పొరపాటు: రోహిత్ భార్యతో సంభాషణ వైరల్!
నకిలీ ఖాతాతో అశ్విన్ పొరపాటు: రోహిత్ భార్యతో సంభాషణ వైరల్!
గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా: కేటీఆర్
గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా: కేటీఆర్
బాబర్ ఆజమ్ Vs ముల్డర్: కేప్ టౌన్ టెస్టులో రికార్డులు, వివాదాలు!
బాబర్ ఆజమ్ Vs ముల్డర్: కేప్ టౌన్ టెస్టులో రికార్డులు, వివాదాలు!
తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన
తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన
పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన
పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన
40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు