Encounter: జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు పాకిస్థానీలతో సహా ఆరుగురు ఉగ్రవాదులు మృతి
జమ్మూ కాశ్మీర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఎం)కి చెందిన ఆరుగురు ఉగ్రవాదులు రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు.
Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఎం)కి చెందిన ఆరుగురు ఉగ్రవాదులు రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. హతమైన ఉగ్రవాదుల్లో నలుగురిని గుర్తించారు. 6 మంది ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్థాన్‌కు చెందిన వారని సంబంధిత భద్రతా వర్గాలు తెలిపాయి. కాగా ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు. ఇది కాకుండా మరో ఇద్దరిని గుర్తిస్తున్నారు. బుధవారం కుల్గామ్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు . ఈసారి ఎన్‌కౌంటర్ కుల్గాం జిల్లాలోని మిర్హామా ప్రాంతంలో జరిగింది. ఇందులో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
వీరిలో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు, నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌తో సంబంధం ఉన్న పాకిస్థానీ ఉగ్రవాది ఉన్నారు. అదే సమయంలో ఆర్మీ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం, కుల్గామ్‌లోని మిర్హామా ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు తమ దుర్మార్గపు కుట్రలను కొనసాగిస్తూ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులకు పాల్పడుతున్నారు. దీంతో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. బుధవారం తెల్లవారుజామున అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఒక పోలీసు గాయపడ్డాడు. ఘటనా స్థలంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పులకు పోలీసులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్‌లో తెలిపారు.
Encounter breaks out between security forces and terrorists in the Mirhama area of Kulgam district. More details awaited: Jammu and Kashmir Police
— ANI (@ANI) December 29, 2021
ప్రస్తుతం కాశ్మీర్‌లోని రెండు జిల్లాలైన అనంత్‌నాగ్, కుల్గామ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌తో సంబంధం ఉన్న ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు, ఒక పాకిస్థానీ ఉగ్రవాది హతమైనట్లు ఆయన తెలిపారు. అన్వేషణ ఇంకా కొనసాగుతోంది. ఒక ఎం4, రెండు ఏకే 47 రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలావుంటే, శనివారం తెల్లవారుజామున, అనంత్‌నాగ్‌లోనే భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇస్లామిక్ స్టేట్ జమ్మూ కాశ్మీర్ (ISJK) ఉగ్రవాది హతమయ్యాడు. శ్రీగుఫ్వారా ప్రాంతంలోని కేకలన్‌లో భద్రతా బలగాలు హతమైన ఉగ్రవాదిని అనంతనాగ్‌లోని కడిపోరా నివాసి ఫహీమ్ భట్‌గా గుర్తించినట్లు కాశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజి) విజయ్ కుమార్ తెలిపారు.
కాశ్మీర్‌లోని ఐజిపి సమాచారం ఇస్తూ, “అతను ఇటీవల ఉగ్రవాద సంస్థ ISJK లో చేరాడు. PS బిజ్బెహరాలో పోలీసు విభాగంలో ASI మహ్మద్ అష్రఫ్ హత్యలో పాల్గొన్నాడు” అని చెప్పారు. గత బుధవారం, బిజ్‌బెహరా ఆసుపత్రి వెలుపల ASI అష్రఫ్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపారు.
Read Also… Omicron: ఒమిక్రాన్ వేరియంట్ విధ్వంసం.. గత ఏడు రోజుల్లో అక్కడ భారీగా కేసులు నమోదు..!