AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi – Joe Biden: అరుదైన, పురాతన బహుమతులను ఇచ్చి పుచ్చుకున్న ప్రపంచ అగ్రనేతలు.. మోడీ, జో బిడెన్..

అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్ గురువారం వైట్‌హౌస్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కి 20వ శతాబ్దానికి చెందిన పురాతన పుస్తక గాలీని అధికారిక బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు అధ్యక్షుడు బిడెన్ .. పాతకాలపు అమెరికన్ కెమెరాను కూడా బహుమతిగా మోడీకి అందజేశారు. 

PM Modi - Joe Biden: అరుదైన, పురాతన బహుమతులను ఇచ్చి పుచ్చుకున్న ప్రపంచ అగ్రనేతలు.. మోడీ, జో బిడెన్..
PM Modi exchanges official gifts
Surya Kala
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jun 22, 2023 | 8:45 AM

Share

ప్రధాని మోడీ అమెరికా మూడు రోజుల పర్యటనలో భాగంగా బిజీబిజీగా గడుపుతున్నారు. మోడీకి అమెరికా అధ్యక్షులు జో బిడెన్‌ దంపతులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరుదేశాధి నేతలు అరుదైన  ప్రత్యేక పురాతన వస్తువులను, అధికారిక బహుమతులుగా అందించారు. అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్ గురువారం వైట్‌హౌస్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కి 20వ శతాబ్దానికి చెందిన పురాతన పుస్తక గాలీని అధికారిక బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు అధ్యక్షుడు బిడెన్ .. పాతకాలపు అమెరికన్ కెమెరాను కూడా బహుమతిగా మోడీకి అందజేశారు.

Pm

Pm

ఈ సందర్భంగా ప్రధాని మోడీ కూడా జో దంపతులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పురాతన వైభవాన్ని తెలియజేసే అరుదైన వస్తువులను బహుమతులుగా అందజేశారు. రాజస్థాన్ లోని జైపూర్‌కు చెందిన మాస్టర్ క్రాఫ్ట్‌మ్యాన్ రూపొందించిన ప్రత్యేక చందనం బాక్స్ ను, భారతీయుల హస్తకళా వైభవాన్ని తెలిపే విధంగా ఉండే హస్తకళ వస్తువులను,  లండన్‌కు చెందిన ఫేబర్ అండ్ ఫేబర్ లిమిటెడ్ ప్రచురించిన ‘టెన్ ప్రిన్సిపల్ ఉపనిషత్తుల ‘ పుస్తకం  మొదటి ఎడిషన్ పుస్తకాన్ని ప్రధాని మోదీ అందించారు. అంతేకాదు గణేశ విగ్రహం, కోల్‌కతాకు చెందిన ఐదవ తరం వెండి కార్మికుల కుటుంబం చేతితో తయారు చేసిన దీపాలను జో దంపతులకు కానుకలుగా అందించారు ప్రధాని మోడీ.

Pm Modi Us Visit

Pm Modi Us Visit

ప్రధాని మోడీ బుధవారం అధికారిక పర్యటనలో భాగంగా రెండో విడతగా వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. అమెరికాకు చెందిన మొదటి జంట తమ అతిథితో ఒక నిమిషం పాటు మాట్లాడుకున్నారు.

Pm 1

Pm

ప్రధాని మోడీ బిడెన్స్‌తో కలిసి విందు

భారత ప్రధాని మోడీకి స్టేట్ డిన్నర్ ఇస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ శ్వేతసౌధంలో ప్రధాని నరేంద్ర మోదీకి లాంఛనంగా స్వాగతం పలికారు. కలిగి విందు భోజనం చేశారు. ఈ రోజు ప్రధాని మోడీ యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు.

Pm2

Pm

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..