Nikhil Srivastava: అగ్రరాజ్యంలో మరో భారతీయుడి అద్భుతం.. 62 ఏళ్లుగా దొరకని సమస్యకు పరిష్కారం చూపిన శ్రీవాస్తవ..

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Dec 08, 2021 | 1:19 PM

Nikhil Srivastava: భారతీయులు అంతర్జాతీయ స్థాయిలో తమ అసమాన ప్రతిభతో అదరగొడుతున్నారు. ఇతర దేశాల వ్యక్తులకు సాధ్యం కానీ అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ భారత దేశ ఖ్యాతిని..

Nikhil Srivastava: అగ్రరాజ్యంలో మరో భారతీయుడి అద్భుతం.. 62 ఏళ్లుగా దొరకని సమస్యకు పరిష్కారం చూపిన శ్రీవాస్తవ..
Nikhil Srivastava

Nikhil Srivastava: భారతీయులు అంతర్జాతీయ స్థాయిలో తమ అసమాన ప్రతిభతో అదరగొడుతున్నారు. ఇతర దేశాల వ్యక్తులకు సాధ్యం కానీ అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ భారత దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఐబీఎమ్‌ తాజాగా.. ట్విట్టర్‌ ఇలా ప్రపంచంలో ఎంతో ప్రాధాన్యత సంపాదించుకున్న టెక్‌ దిగ్గజాలకు సీఈఓలుగా మన భారతీయులు ఉండడం నిజంగా దేశం గర్వించతగ్గ అంశమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా ఈ జాబితాలోకి మరో భారతీయుడు వచ్చి చేరారు. ప్రముఖ ప్రముఖ భారతీయ-అమెరికన్ గణిత శాస్త్రజ్ఞుడు నిఖిల్ శ్రీవాస్తవ తన అసమాన ప్రతిభతో అగ్రరాజ్యంలో కీర్తి గడించారు.

62 ఏళ్లుగా ప‌రిష్కరం దొర‌క‌ని స‌మ‌స్యను అయ‌న ప‌రిష్కరించి మ‌రోసారి భార‌త దేశం గౌరవాన్ని మ్యాథ‌మెటిక‌ల్ సోసైటీలో నిల‌బెట్టారు. 1959లో తలెత్తిన ఒక సమస్యను నిఖిల్ శ్రీవాస్తవ పరిష్కరించారు. ప్రస్తుతం ఈ టాపిక్‌ అమెరికాలో సంచలనంగా మారింది. అమెరికన్ మ్యాథమెటికల్ సొసైటీ ప్రారంభించిన‌ సిప్రియన్ ఫోయాస్ ప్రైజ్‌కు నిఖిల్ శ్రీవాస్తవను సంయుక్తంగా ఎంపిక చేశారు. 1959 కడిసన్-సింగర్ సమస్య పరిష్కారానికి కృషి చేసిన గ్రూప్‌ తరఫున తాను ఈ అవార్డును స్వీకరిస్తున్నట్లు నిఖిల్‌ ప్రకటించారు.

త‌న‌తో పాటు మ‌రికొంద‌రు మిత్రులు కుడా ఈ స‌మ‌స్య ప‌రిష్కారిని కృషి చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద గణిత శాస్త్రవేత్తల స‌మావేశం అయిన మ్యాథ‌మెటిక‌ల్ మీటింగ్ సీటెల్‌లో వ‌చ్చే ఏడాది జనవరిలో జ‌ర‌గునుంది, ఆపరేటర్ థియరీ, ఫ్లూయిడ్ మెకానిక్స్‌ పండితులైన సిప్రియన్ ఫోయాస్ జ్ఞాపకార్థం ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ అవార్డుకు ఎంపికైనందుకుగాను నిఖిల్‌ 5వేల డాలర్లను అందుకోనున్నారు. ఇదిలా ఉంటే నిఖిల్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మ్యాథమెటిక్స్ అసోసియేటివ్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

అగస్త్య. కంటు, టీవీ9 తెలుగు, హైదరాబాద్‌.

Also Read: Tamanna: మిల్కీబ్యూటీకి బంపర్ ఆఫర్.. కమల్ హాసన్ సినిమాలో తమన్నాకు ఛాన్స్..

Anantapur Anganwadi: అనంతపురం జిల్లాల్లో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే..

Beetroot Side Effects: ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు బీట్‏రూట్ తింటే ప్రమాదమే.. ఎందుకంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu