Tamanna: మిల్కీబ్యూటీకి బంపర్ ఆఫర్.. కమల్ హాసన్ సినిమాలో తమన్నాకు ఛాన్స్..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Dec 08, 2021 | 11:04 AM

స్టార్ డైరెక్టర్ శంకర్.. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న చిత్రం ఇండియన్ 2. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ

Tamanna: మిల్కీబ్యూటీకి బంపర్ ఆఫర్.. కమల్ హాసన్ సినిమాలో తమన్నాకు ఛాన్స్..
ఒక్కో సినిమాకు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న తమన్నా.. తాజాగా కన్నడలో ఒక పాన్ ఇండియా మూవీకి.. తెలుగులో ఎఫ్3.. చిరుతో ఒక సినిమాలో జత కట్టేందుకు ఓకే చేసింది.

స్టార్ డైరెక్టర్ శంకర్.. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న చిత్రం ఇండియన్ 2. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ భారతీయుడు చిత్రానికి ఈ సినిమా సిక్వెల్. అయితే ఈ షూటింగ్ ప్రమాదం జరిగి.. వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్.. డైరెక్టర్ శంకర్ మధ్య మనస్పర్థలు రావడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. తమ సినిమాను పూర్తిచేసిన తర్వాత శంకర్ తదుపరి చిత్రాలను తీయాలంటూ కోర్టును ఆశ్రయించింది లైకా సంస్థ. దీంతో ఇండియన్ 2 రావడం కష్టమే అనుకున్నారంతా..

అయితే వీరిద్దరి మధ్య ఏర్పడిన వివాదాన్ని తొలగించేందుకు కాస్త ఎక్కువగానే కష్టపడ్డాడు కమల్. ఎట్టకేలకు మేకర్స్… డైరెక్టర్ మధ్య విభేదాలను తగ్గించి ఇండియన్ 2 సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నం చేశాడు కమల్ హాసన్. ఇక తాజా సమాచారం ప్రకారం త్వరలోనే ఇండియన్ 2 సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది.. అయితే ఇందులో కమల్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‏గా నటిస్తోంది. కానీ.. ఇప్పుడు కాజల్ ప్రెగ్నెన్సీ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో తిరిగి ఈ సినిమాలో ఫీమేల్ రోల్ కోసం వెతుకలాట ప్రారంభించింది చిత్రయూనిట్. ఇక లేటేస్ట్ టాక్ ప్రకారం ఇందులో కాజల్ స్థానంలోకి మిల్కీబ్యూటీ తమన్నాను తీసుకున్నారట. బ్యాక్ టూ బ్యాక్ వరుస చిత్రాలతో దూసుకుపోతుంది తమన్నా. వెండితెరపైనే కాకుండా.. ఓటీటీలోనూ వెబ్ సీరిస్ చేస్తూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం తమన్నా.. వెంకటేష్.. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఎఫ్3 సినిమాలో నటిస్తుంది. ఇక ఇప్పుడు ఏకంగా కమల్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది ఈ మిల్కీబ్యూటీ.

Also Read: Bigg Boss 5 Telugu: పర్ఫామెన్స్‎తో రెచ్చిపోయిన సన్నీ.. హగ్గులతో షణ్ముఖ్ పరువు తీశాడుగా..

AR Rahman: నా కూతుర్లకు నేను ఇచ్చే సలహా అదే.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఏఆర్ రెహమాన్..

Sudigali Sudheer: జబర్దస్త్‏ను వీడనున్న సుడిగాలి సుధీర్ టీం.. స్జేట్ పైనే ఎమోషనల్ కామెంట్స్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu