Ashishkumar Chauhan: వచ్చే 30-40 ఏళ్లల్లో భారత్‌కు సువర్ణవకాశం.. చైనాను సైతం దాటేస్తాం..
BSE CEO Ashishkumar Chauhan: కరోనావైరస్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కరోనా ప్రారంభం నుంచి అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూ.. ఇప్పుడిప్పుడే గట్టేక్కుతున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్
BSE CEO Ashishkumar Chauhan: కరోనావైరస్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కరోనా ప్రారంభం నుంచి అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూ.. ఇప్పుడిప్పుడే గట్టేక్కుతున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ మలుపు తిరగడంతో సూచీలు లాభాలబాటలో పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు, కంపెనీలకు ఆశావాద ధృక్పదం మొదలైంది. ఈ క్రమంలో ఈక్విటీల షేర్లు, పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 20 నెలల ప్రయాణంలో స్టాక్ మార్కెట్‌లో సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలే తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆశిష్‌కుమార్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 30-40 ఏళ్లు భారత్‌కు సువర్ణవకాశమని.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి ఆర్థిక వృద్ధిలో చైనాను సైతం దాటేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆశిష్‌కుమార్ చౌహాన్.. లీడర్స్ ఆఫ్ గ్లోబల్ భారత్ ఇంటర్వ్యూ సిరీస్‌లో భాగంగా న్యూస్9తో ప్రత్యేకంగా మాట్లాడారు. కరోనా తర్వాత స్టాక్ మార్కెట్‌లో ఎన్నో మార్పులొచ్చాయని పేర్కరొన్నారు. సమాధానాలకంటే.. ఎన్నో ప్రశ్నలు అందరినీ వెంటాడుతున్నాయని అభిప్రాయపడ్డారు. సాధారణ పెట్టుబడిదారుల నుంచి కంపెనీల వరకూ డబ్బు భద్రత గురించి ఆందోళన మొదలైందని తెలిపారు. చౌహాన్.. సెన్సెక్స్‌ను ఆర్థిక వ్యవస్థకు కీలకమైన బేరోమీటర్‌గా చూడాలని వ్యాఖ్యానించారు. అయితే సాధారణ పెట్టుబడిదారులకు ఆశావాదం, భద్రత సవాళ్లు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆశిష్‌కుమార్ చౌహాన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కరోనా మహమ్మారిని కాలాన్ని మీరు ఎలా చూస్తారు.. మార్కెట్లపై సానుకూల దృక్పథం నెలకొందా అన్న ప్రశ్నకు చౌహాన్ సమాధానమిస్తూ.. గత మార్చిలో మార్కెట్లు పతనమైనప్పుడు.. భారతదేశంలో మారణహోమం జరుగుతుందనే పుకార్లు, అంచనాలతో క్షీణించాయని పేర్కొన్నారు. అలా జరగడం లేదని ప్రపంచం మెల్లమెల్లగా గుర్తించిందని.. దీంతో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయని తెలిపారు. దేశంలో 70 రోజుల లాక్‌డౌన్లో మార్కెట్లు ఆశజనకంగా లేవని.. పూర్తిగా క్షీణించాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌ను ప్రకటించినప్పుడు.. వెంటనే BSE తెరిచి ఉంటుందని నేను ప్రకటించానన్నారు. చాలామంది.. తాము సజీవంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటే.. మీరు మార్కెట్లను తెరిచి ఉంచడానికి ప్రయత్నిస్తున్నారంటూ పలువురు విమర్శించారన్నారు. అయితే.. లాక్‌డౌన్ ప్రకటించడానికి ఒక వారం ముందు ప్రభుత్వం స్టాక్ మార్కెట్‌లను అవసరమైన సేవగా మార్చిందన్నారు. అయితే.. అన్ని అంచనాలను పరిగణలోకి తీసుకొనే ఆ ప్రకటన చేశానన్నారు. మేము ఎలా పనిచేశాము అనే ప్రశ్నకు నాలుగు కోట్ల పెట్టుబడిదారుల ఖాతాలను చేరుకోవడానికి మాకు అక్షరాలా 45 సంవత్సరాలు పట్టిందన్నారు. గత ఏడాదిన్నరలో మేము 80 శాతానికి చేరుకున్నామని తెలిపారు. మార్కెట్‌లలోని అనుభవజ్ఞుల సూచనల ప్రకారం.. నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. తాము.. భారత్ కంటే.. అమెరికన్ ఆర్ధిక పరిస్థితులకు అనుగుణంగా పని చేస్తామన్నారు. డబ్బు సంపాదించే స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు వాస్తవాలను.. ఇప్పటి పరిస్థితులను అనుగుణంగా భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలన్నారు.
పెట్టుబడులకు మార్గం..
కోవిడ్-19 కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ 20 శాతం పడిపోయిందని.. ఇప్పుడు కొనుగోలు, అమ్మకాలను చూస్తే.. వృద్ధి రేటు దూసుకెళ్తుందని తెలిపారు. ఒక సంవత్సరం పూర్తయితే, ఎకానమీ డేటా మూడు-ఆరు నెలల తర్వాత వస్తుంది. కాబట్టి, అవి ఏడాదిన్నర పాత డేటా లాగా ఉంటాయని.. వాటి గురించి స్పష్టంగా చెప్పడం అవసరమన్నారు. అందుకే స్టాక్ మార్కెట్‌లను అర్థం చేసుకోవడానికి మనకు తాత్వికత అవసరమంటూ చౌహాన్ స్పష్టంచేశారు. అయితే.. పెట్టుబడులు పెట్టేందుకు తాను అంపైర్ మాత్రం కాదని అభిప్రాయపడ్డారు. ప్రజలు ప్రాథమికంగా సులభంగా లావాదేవీలు జరిపేందుకు, కంపెనీల గురించి, దేశం గురించి, పరిశ్రమల గురించి సులభంగా సమాచారాన్ని పొందేందుకు, ఆపై వ్యక్తులు పెట్టుబడులు పెట్టడానికి వీలుగా ఒక ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించడం తనకు మంచే చేసిందన్నారు. ఎన్నో ఆవిష్కరణలతో ఈరోజు తొమ్మిది కోట్ల పెట్టుబడిదారుల ఖాతాలకు బీఎస్‌ఈ చేరినప్పటికీ తక్కువ పెట్టుబడితో ఉన్నామన్నారు. డూప్లికేట్ ఖాతాల్లాంటివి ఉన్నందున మనం దాదాపు 15-20 రెట్లు ఎక్కువ చేరుకోవాలని పేర్కొన్నారు. కాబట్టి, భవిష్యత్తులో ఖాతాల సంఖ్య 150 కోట్లు ఉన్నా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారు చాలా తక్కువన్నారు. సాధారణంగా ఆర్థిక వ్యవస్థలో కుటుంబాలు పొదుపు చేస్తాయి. స్టాక్ మార్కెట్‌లు పొదుపులను ఉత్పాదక పెట్టుబడిగా మార్చడానికి మధ్యంతరానికి మంచి మార్గమని.. కంపెనీలు కోరుకునేది అదేనని చౌహాన్ తెలిపారు. దశాబ్దాలుగా భారత్ ఎన్నో ఒడిదుడుకులను చూసిందని చౌహాన్ పేర్కొన్నారు.
సూచనలతో పెట్టబడులు పెడితే..
మీరు ఒకవేళ పెట్టుబడి పెట్టాలనుకుంటే.. తప్పనిసరిగా మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ స్కీమ్‌లు లేదా అడ్వైజర్, ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ ద్వారా వెళ్లాలని సూచించారు. చాలామంది IPOలలో పెట్టుబడి పెట్టిన కొంతమంది పెట్టుబడిదారులు నష్టాలను చవిచూస్తే.. మరికొంతమంది డబ్బు సంపాదించారన్నారు. 2000 లేదా 2001 లేదా 2007-08తో పోలిస్తే భారతదేశం నేడు కొంచెం భిన్నమైన స్థితిలో ఉంది. ఎందుకంటే నేడు మన దగ్గర 660 బిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ నిల్వలు ఉన్నాయని చౌహాన్ తెలిపారు. చైనాకు వెళ్లే పెట్టుబడిలో కొంత భాగం ఇప్పుడు భారతదేశానికి మళ్లించబడుతుంది. అంతర్జాతీయ ఇండెక్స్ కంపెనీలలో ఒకటైన MSCI, దాని ఇండెక్స్‌లలో చాలా భారతీయ కంపెనీలను ఉంచింది ఇది తనకు ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. ప్రాథమికంగా చూస్తే భారతదేశం మరింత ఆకర్షణీయంగా మారుతోందన్నారు. ప్రపంచంలో జపాన్, ఐరోపాతో పాటు అకస్మాత్తుగా వృద్ధాప్యం బారిన పడుతున్న చైనాతో పోలిస్తే భారతదేశానికి రాబోయే 30-40 సంవత్సరాలు అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయన్నారు. వినియోగం, ఆవిష్కరణలు, డిమాండ్, సంపద సృష్టి పరంగా భారత్ కేంద్రంగా జరగనుందని తెలిపారు. రాబోయే 50 సంవత్సరాలు భారతదేశానికి చాలా కీలకంగా ఉండబోతున్నాయన్నారు. ఇప్పటికీ వృద్ధి పరంగా మెరుగులోనే ఉందని అభిప్రాయపడ్డారు.
ఉద్యోగాలను సృష్టించడం, ఆర్థిక వ్యవస్థకు సంపదను అనుసంధానం చేయడం ముఖ్యమన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థ లేదా సమాజం భవిష్యత్తు సామర్థ్యాన్ని నిర్ధేశిస్తుందని అభిప్రాయపడ్డారు. పొదుపు నుండి ఈక్విటీతో పెట్టుబడుల వరకు అనేక మార్గాలు ఉన్నాయన్నారు. అవగాహన ముఖ్యమని తెలిపారు. ప్రజలు ఖాతాలను తెరవడం, వ్యాపారం చేయడం సులభం చేయడం ద్వారా, బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్లల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆర్థిక వృద్ధికి చేరుకోవచ్చన్నారు. ట్రేడింగ్ డెరివేటివ్‌లలో పెట్టుబడి పెట్టవద్దని.. ఉదయం కొనుగోలు చేయడం, మధ్యాహ్నం విక్రయించడం లాంటి చర్యలు పెట్టుబడి కాదన్నారు. ట్రేడింగ్ గురించి ఎప్పుడూ చింతించాల్సిన అవసరం లేదని.. అందరూ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చని చౌహాన్ అభిప్రాయపడ్డారు.
Also Read: