AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digital Payments: దేశ ప్రజలకు షాక్ ఇవ్వనున్న ఆర్‌బీఐ.. ఆ చెల్లింపులపై ‘ఛార్జీల వడ్డన’కు రంగం సిద్ధం..!

RBI నివేదిక ప్రకారం, Google Pay, Paytm, Phone-Pe, BHIM యాప్ వంటి ఇతర UPI ప్లాట్‌ఫారమ్‌లలో ప్రతి నెలా దాదాపు 1.22 బిలియన్లు అంటే దాదాపు 122 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని పేర్కొంది.

Digital Payments: దేశ ప్రజలకు షాక్ ఇవ్వనున్న ఆర్‌బీఐ.. ఆ చెల్లింపులపై 'ఛార్జీల వడ్డన'కు రంగం సిద్ధం..!
Upi Payments
Venkata Chari
|

Updated on: Dec 08, 2021 | 12:06 PM

Share

UPI Payments: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం మానిటరీ పాలసీ కమిటీ (MPC) నాల్గవ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని సమర్పించారు. సమావేశ ఫలితాలను ప్రకటిస్తూ, వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతామని శక్తికాంత దాస్ ప్రకటించారు. రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద స్థిరంగా ఉంచారు. మానిటరీ పాలసీ కమిటీ తన అనుకూల వైఖరిని కొనసాగించింది. గత ఏడాది మార్చిలో (2020 సంవత్సరం) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 0.75 శాతం, మేలో 0.40 శాతం తగ్గించింది. వరుస కోతల తర్వాత, రెపో రేటును రికార్డు స్థాయిలో 4 శాతానికి తగ్గింది.

డిజిటల్ చెల్లింపులు ఖరీదైనవి కానున్నాయా.. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ డిజిటల్ చెల్లింపులపై కీలక సమాచారం అందిచారు. డిజిటల్ చెల్లింపులపై విధించే ఛార్జీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ పత్రాన్ని విడుదల చేస్తుందని తెలిపారు. దీన్ని బట్టి రానున్న కాలంలో డిజిటల్‌ పేమెంట్స్‌ మనం అదనంగా చార్జీలు చెల్లించాల్సి రావచ్చని స్పష్టమవుతోంది. యూపీఐ ఆధారిత ఫీచర్ ఫోన్ ప్రొడక్ట్‌లను కూడా విడుదల చేసేందుకు ఆర్బీఐ సన్నాహాలు చేస్తోందని గవర్నర్ ప్రకటించారు.

దేశంలో వేగంగా పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులు.. 2016లో డీమోనిటైజేషన్ తర్వాత భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరిగాయి. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో, దేశంలో డిజిటల్ చెల్లింపుల గ్రాఫ్ అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఇన్ఫెక్షన్‌ను నివారించే ప్రయత్నంలో ప్రజలు డిజిటల్ చెల్లింపులపై ఆధారపడ్డారు. అందువల్ల, భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు నిరంతరం వేగంగా పెరుగుతున్నాయి.

ఒక నివేదిక ప్రకారం, Google Pay, Paytm, Phone-Pe, BHIM యాప్ వంటి ఇతర UPI ప్లాట్‌ఫారమ్‌లలో ప్రతి నెలా దాదాపు 1.22 బిలియన్లు అంటే దాదాపు 122 కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతున్నట్లు తేలంది. మరోవైపు, 2016 సంవత్సరం అంటే 5 సంవత్సరాల క్రితం పరిస్థితిని పోల్చి చూస్తే, ప్రస్తుతం అది 550 శాతం పెరిగింది. 2016-17లో 1,004 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. 2020-2021లో ఈ సంఖ్య 5,554 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్-మే 2021 నెలలో, డిజిటల్ లావాదేవీలు 2020తో పోలిస్తే 100 శాతం కంటే ఎక్కువ పెరిగాయి.

UPI అంటే.. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(UPI) మొబైల్ యాప్ ద్వారా పనిచేసే డిజిటల్‌గా చెల్లింపులు చేస్తుంది. ఈ యాప్ ద్వారా సురక్షితమైన మార్గంలో చెల్లింపులు చేయవచ్చు. డబ్బు నిలిచిపోయినా బ్యాంకు ఖాతాలో తిరిగి చేరుతుంది. వీటితో బిల్లులు, ఆన్‌లైన్‌లో నిధులను బదిలీ, బంధువులు లేదా స్నేహితులకు డబ్బు పంపవచ్చు. దీని కోసం మీరు మీ మొబైల్ ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, మొబైల్ నంబర్‌ను బ్యాంక్ ఖాతాతో లింక్ చేయాల్సి ఉంటుంది.

Also Read: RBI Monetary Policy: ఆర్‌బీఐ సంచలన నిర్ణయం.. యథాతథంగా కీలక వడ్డీ రేట్లు..

Credit Card Tips: క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించలేకపోతున్నారా.. అయితే ఇలా చేయండి..