Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card Tips: క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించలేకపోతున్నారా.. అయితే ఇలా చేయండి..

క్రెడిట్‌ కార్డుల వినియోగంతో జనం సతమతమవుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అయితే చాలా మంది తమ సొంత తప్పిదాల వల్లే ఇలాంటి కష్టాల వలలో..

Credit Card Tips: క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించలేకపోతున్నారా.. అయితే ఇలా చేయండి..
Credit Card Paying Simple W
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 08, 2021 | 11:11 AM

Credit Card Tips: క్రెడిట్‌ కార్డుల వినియోగంతో జనం సతమతమవుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అయితే చాలా మంది తమ సొంత తప్పిదాల వల్లే ఇలాంటి కష్టాల వలలో పడుతున్నారు. మార్కెట్ నిపుణులు మాత్రం క్రెడిట్ కార్డును నమ్ముకుంటున్నారు. మీరు క్రెడిట్ కార్డును సరిగ్గా ఉపయోగిస్తే దాని ప్రయోజనాలకు లోటు ఉండదు. ఆలోచించకుండా ఉపయోగిస్తే మీరు నష్టాలను నివారించలేరు. మీరు కూడా ఇలాంటి వర్గానికి చెందిన వ్యక్తులలో ఉండి ఉంటే జాగ్రత్త.. విచక్షణారహితంగా ఉపయోగించి క్రెడిట్ కార్డ్ రుణ ఉచ్చులో పడకండి. ఒకవేల అందులో పడి ఉంటే దాని నుండి ఎలా బయటపడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అప్పు ఎక్కువగా ఉంటే పర్సనల్ లోన్ తీసుకోండి..

మీ క్రెడిట్ కార్డ్ బిల్లు చాలా పెరిగిపోతుంటే చెల్లించడం చాలా ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి సమయంలో మీరు పర్సనల్ లోన్ తీసుకొని అన్ని కార్డ్‌ల బిల్లులను చెల్లించడం మంచిది. వాస్తవానికి పర్సనల్ లోన్ EMI క్రెడిట్ కార్డ్‌పై వడ్డీ రేటు కంటే తక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ కాలం అందుబాటులో ఉంటుంది. దీని కారణంగా EMI గణనీయంగా తగ్గుతుంది. అలాగే, బహుళ క్రెడిట్ కార్డ్‌లను నిర్వహించడం కంటే వ్యక్తిగత రుణ ఖాతాను నిర్వహించడం చాలా సులభం. మీకు డబ్బు సర్దుబాటు అయిన తర్వాత మీరు వ్యక్తిగత రుణాన్ని కూడా ముందుగానే క్లోజ్ చేయవచ్చు. అయితే, మునుపటి బిల్లుల EMI ముగిసే వరకు కొత్త షాపింగ్‌కు దూరంగా ఉండాలని గుర్తుంచుకోండి.

వీలైనంత త్వరగా బ్యాలెన్స్ మొత్తాన్ని EMIలోకి మార్చండి

క్రెడిట్ కార్డ్ డెట్ ట్రాప్‌ను నివారించడానికి లేదా బయటపడేందుకు మీరు కొనుగోలుతో దాన్ని ఎలా చెల్లించాలో నిర్ణయించుకోవడం మంచిది. ఒకేసారి చెల్లించేందుకు అవకాశం ఉంటే వీలైనంత త్వరగా ఆ మొత్తాన్ని EMIగా మార్చండి. EMIకి మార్చడం వలన మీపై అదనపు ఛార్జీలు విధించే అవకాశం ఉండదు. అలాగే మీపై భారం కొంత వరకు తగ్గుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే EMI వ్యవధి వీలైనంత తక్కువగా ఉండాలా ప్లాన్ చేసుకోవాలి. ఇందులో కనీస వడ్డీ రేటు చెల్లించండి చాలా ముఖ్యం.  అదే సమయంలో కంపెనీల ఉత్పత్తులపై నో కాస్ట్ EMIని సద్వినియోగం చేసుకోండి. ఇలాంటి సమయంలో మీకు ఆ వడ్డీని తిరిగి ఇస్తుంది. తద్వారా దానిపై మీకు ఉన్న వడ్డీ ధరను తగ్గుతుంది.

బ్యాలెన్స్‌ని మరొక క్రెడిట్ కార్డ్‌కి బదిలీ చేయండి

మీరు బహుళ బ్యాంకుల క్రెడిట్ కార్డ్‌లను(వివిధ రకాల బ్యాంక్ కార్డులు) ఉపయోగిస్తుంటే ఏ బ్యాంక్ మీకు మెరుగైన రేట్లకు రుణాన్ని అందజేస్తుందో ఆ బ్యాంక్‌ను ఎంచుకోండి. అటువంటి పరిస్థితిలో మీరు అధిక వడ్డీని వసూలు చేసే బ్యాంకు నుండి మీ కార్డును తక్కువ వడ్డీ రేటును అందించే బ్యాంకు కార్డుకు బదిలీ చేసుకోవచ్చు. తద్వారా దానిని EMIగా మార్చుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు అధిక వడ్డీని తప్పించుకోగలరు. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే మీ ఆర్ధిక పరిస్థితి సరైన దారిలో నడుస్తుంది. 

ఇవి కూడా చదవండి: చేపలు అమ్ముకునే మహిళను బస్సు ఎక్కనివ్వని అధికారులు.. కన్యాకుమారిలో ఆధునిక అనాగరికం..

Beauty Tips: చలికాలంలో జుట్టు, చర్మం పొడిబారడం వల్ల ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ హోం రెమెడీస్ ప్రయత్నించండి..