చేపలు అమ్ముకునే మహిళను బస్సు ఎక్కనివ్వని అధికారులు.. కన్యాకుమారిలో ఆధునిక అనాగరికం..
కన్యాకుమారి జిల్లాలో చేపలు అమ్ముకునే మహిళకు బస్సులో ప్రయాణించే అర్హత లేదని సిబ్బంది ఎక్కించుకోలేదు.ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా వివాదంగా మారింది..
మనం ఇప్పటికీ రాతియుగంలో ఉన్నామా.. లేక ఆధునిక యుగంలో ఉన్నామా అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే కన్యాకుమారి జిల్లాలో చేపలు అమ్ముకునే మహిళకు బస్సులో ప్రయాణించే అర్హత లేదని సిబ్బంది ఎక్కించుకోలేదు.ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా వివాదంగా మారింది. కన్యాకుమారి జిల్లాలో చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న సెల్వి .. కులచ్చల్ డిపోలో బస్సు ఎక్కేందుకు వెళ్లింది. అయితే ఎక్కడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. బస్సంతా చేపల వాసన వస్తుందని.. అది మాకు పడదంటూ సిబ్బంది సమాధానమిచ్చారు. సుమారు మూడు గంటలపాటు బస్సు డిపోలోనే ప్రాధేయపడ్డా.. బస్సు ఎక్కనివ్వలేదు.
కోపోద్రిక్తుడైన వృద్ధురాలు తన ఆవేదన వ్యక్తం చేసింది. సెల్వం బస్ స్టేషన్ టైమ్ కంట్రోల్ ఆఫీస్ ముందు వెళ్లి బస్సులో ఆమెను ఎలా దించుతారు? అంటూ అక్కడి స్థానికులు ప్రశ్నించారు. నేను వాణియకుడికి నడిచి వెళ్లాలా..? అంటూ ఆ మహిళ ప్రశ్నించింది.
ఈ వీడియో ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని మత్యకార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కులచ్చల్ డిపో అధికారి, డ్రైవర్, కండక్టర్లతో సహా ఐదుగురిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు.ఇది ఆధునిక అంటరానితనం అని.. బస్సు డ్రైవర్‌పై తగిన చర్యలు తీసుకోవాలా అని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
குமரி அருகே துர்நாற்றம் வீசுவதாக கூறி மீன் விற்ற பெண்ணை நடத்துனர் இறக்கிவிட்டதால் பேருந்து நிலையத்தில் கத்தி கூச்சலிட்ட மீன் விற்பனை செய்யும் மூதாட்டி @amico_del_ur @Im_VelayuthaN @senthil10pm33 @collectorkki @rajakumaari pic.twitter.com/KLERWTSpyT
— Divakar (@divakarMathew) December 7, 2021
ఇవి కూడా చదవండి: UP Assembly Election 2022: యూపీలో రాబోయే ముఖ్యమంత్రి ఎవరో తెలుసా..? సర్వేలో వెల్లడైన సంచలన విషయాలు..!
రైల్వే ట్రాక్‌లపై కంకరాళ్లను ఎందుకు వేస్తారు.. దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసుకోండి..