Forbes Most Powerful Women: అత్యంత శక్తివంతమైన మహిళగా ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. 2021 ఫోర్బ్స్‌ జాబితా వెల్లడి..

Forbes Most Powerful Women: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాను ఫోర్బ్స్‌ వెల్లడించింది. ఫోర్బ్స్ రూపొందించిన అత్యంత శక్తివంతమైన 100 మంది

Forbes Most Powerful Women: అత్యంత శక్తివంతమైన మహిళగా ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. 2021 ఫోర్బ్స్‌ జాబితా వెల్లడి..
Nirmala Sitharaman
Follow us
Shaik Madar Saheb

| Edited By: Anil kumar poka

Updated on: Dec 09, 2021 | 4:37 PM

Forbes Most Powerful Women: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాను ఫోర్బ్స్‌ వెల్లడించింది. ఫోర్బ్స్ రూపొందించిన అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడో సంవత్సరం కూడా చోటు దక్కించుకున్నారు. 2021లో ఆమె ర్యాంకింగ్ 37కి పెరిగింది. నిర్మలా అమెరికన్ కౌంటర్ జానెట్ యెల్లెన్ కంటే రెండు స్థానాలు ముందున్నారు. ఏడాది క్రితం నిర్మలా సీతారామన్‌ 41 స్థానంలో ఉన్నారు. కాగా.. అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్‌ రెండో స్థానంలో నిలిచారు.
అత్యంత శక్తివంతమైన మహిళల మొదటి స్థానంలో మెకెంజీ స్కాట్ (యూఎస్‌) ఒకటో స్థానంలో నిలవగా.. 3లో క్రిస్టీన్ లగార్డ్ (ఫ్రాన్స్‌), మేరీ బర్రా (యూఎస్‌)  4వ స్థానంలో, మెలిండా ఫ్రెంచ్ గేట్స్ (యూఎస్‌) 5లో, అబిగైల్ జాన్సన్ (యూఎస్‌) 6లో, అనా ప్యాట్రిసియా బోటిన్(స్పెయిన్) 7లో, ఉర్సులా వాన్ డెర్ లేయెన్ (జర్మనీ) 8లో, సాయ్ ఇంగ్-వెన్ (తైవాన్) 9వ స్థానంలో, జూలీ స్వీట్ (యూఎస్‌) 10వ స్థానంలో నిలిచారు.
కాగా.. భారత్‌ నుంచి Nykaa వ్యవస్థాపకురాలు, CEO ఫల్గుణి నాయర్ 88వ స్థానంలో నిలిచారు. ఆమె ఇటీవలే భారతదేశం ఏడవ మహిళా బిలియనీర్ గా నిలిచారు. స్టాక్ మార్కెట్‌లో తన కంపెనీ స్టార్ అరంగేట్రం తర్వాత అత్యంత సంపన్నమైన బిలియనీర్ గా రూపాంతరం చెందారు. ఫోర్బ్స్‌ ర్యాంకింగ్స్‌లో ఇతర భారతీయ వ్యాపారవేత్తలు రోషిణి నాడార్ (52), HCL టెక్నాలజీస్ చైర్‌పర్సన్, భారతదేశంలో లిస్టెడ్ IT కంపెనీకి నాయకత్వం వహించిన మొదటి మహిళ, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్, వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా (72) స్థానంలో నిలిచారు.
కాగా.. ఈ సంవత్సరం ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న మెకెంజీ స్కాట్ తన సంపదలో $8.6 బిలియన్లను దాతృత్వంగా ప్రకటించారు.