AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP: ఏపీ ప్రభుత్వానికి ఏ బ్యాంకులో ఎన్ని అప్పులు.. రాజ్యసభలో వివరాలు వెల్లడించిన కేంద్ర సహాయ మంత్రి

AP Government Bank Loan: ఏపీ ప్రభుత్వం పది జాతీయ బ్యాంకుల నుంచి రూ.57,479 కోట్ల అప్పు తీసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ వెల్లించారు. రాజ్యసభలో

AP: ఏపీ ప్రభుత్వానికి ఏ బ్యాంకులో ఎన్ని అప్పులు.. రాజ్యసభలో వివరాలు వెల్లడించిన కేంద్ర సహాయ మంత్రి
Ap Loans
Shaik Madar Saheb
|

Updated on: Dec 08, 2021 | 6:30 AM

Share

AP Government Bank Loan: ఏపీ ప్రభుత్వం పది జాతీయ బ్యాంకుల నుంచి రూ.57,479 కోట్ల అప్పు తీసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ వెల్లించారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేవ్‌లో 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంఎనీలకు జాతీయ బ్యాంకులు నేరుగా రుణాలు మంజూరు చేశాయని, అసలు, వడ్డీ చెల్లింపు బాధ్యత కార్పొరేషన్లు, కంపెనీలదేనని స్పష్టం చేశారు. అయితే 2019 నుంచి 2021 వరకు జాతీయ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నట్లు వివరించారు.

ఏ బ్యాంకులో ఎంత రుణం.. స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా నుంచి 9 సంస్థలు రూ.11,937 కోట్ల రుణం, బ్యాంక్‌ ఆఫ్‌ భరోడా నుంచి 5 కంపెనీలు, కార్పొరేషన్లు రూ.10,865 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి 3 సంస్థలకు రూ.7 వేల కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర నుంచి నాలుగు సంస్థలకు రూ.2,970 కోట్ల రుణం అందించాయి. ఇక కెనరా బ్యాంకు నుంచి రూ.4,099 కోట్లు, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకు నుంచి రూ.750 కోట్లు రుణం మంజూరు చేశాయి.

ఇంకా.. ఇండియన్‌ బ్యాంక్‌ నుంచి రూ.5,500 కోట్లు, ఇండియన్‌ ఓవర్‌సిస్‌ బ్యాంకు నుంచి రూ.1,750 కోట్లు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి రూ.5,633 కోట్లు, యూనియన్‌ బ్యాంకు నుంచి రూ.6,975 కోట్లు రుణం పొందినట్లు మంత్రి వివరించారు.

Also Read:

UP Assembly Election 2022: యూపీలో రాబోయే ముఖ్యమంత్రి ఎవరో తెలుసా..? సర్వేలో వెల్లడైన సంచలన విషయాలు..!

Covishield Vaccine: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తిని 50 శాతం తగ్గిస్తున్నాం.. సీఈఓ అదర్‌ పూనావాలా

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!