Anantapur Anganwadi: అనంతపురం జిల్లాల్లో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే..

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Dec 08, 2021 | 10:34 AM

Anantapur Anganwadi Recruitment 2021: అనంతపురం జిల్లాలో అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన మహిళా, శిశు అభివృద్ధి సంస్థ అనంతపురం జిల్లాలోని 16 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న..

Anantapur Anganwadi: అనంతపురం జిల్లాల్లో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే..
Anantapur Anganwadi

Follow us on

Anantapur Anganwadi Recruitment 2021: అనంతపురం జిల్లాలో అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన మహిళా, శిశు అభివృద్ధి సంస్థ అనంతపురం జిల్లాలోని 16 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 365 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అంగన్‌వాడీ కార్యకర్త, మినీ అంగన్‌వాడీ కార్యకర్త, అంగన్‌వాడీ సహాయకులు వంటి ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణత. వివాహిత మహిళ అయి ఉండి, స్థానికురాలై ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-07-2021 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను సీడీపీఓలు నిర్వహించే డిక్టేషన్‌, ఇతర వివరాలను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అంగన్‌వాడీ కార్యకర్తకి నెలకు రూ. 11,500, మినీ అంగన్‌వాడీ కార్యకర్తకి నెలకు రూ. 7000, అంగన్‌వాడీ సహాయకులకి నెలకు రూ. 7000 చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు రూ. 16-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: YSRCP: ఏపీని ఆదుకోండి.. కేంద్రం అందించాల్సిన తోడ్పాటుపై అమిత్ షాకు వైసీపీ ఎంపీల విజ్ఞప్తి..

Carrot Benefits: వింటర్‌లో క్యారెట్ తింటే ఆ సమస్యలన్నీ మటుమాయం.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

Watch Video: తొలిసారి బౌలింగ్ చేసిన బాబర్.. తృటిలో చేజారిన మొదటి వికెట్.. నెటిజన్లను ఆకట్టుకుంటోన్న వీడియో..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu