Watch Video: తొలిసారి బౌలింగ్ చేసిన బాబర్.. తృటిలో చేజారిన మొదటి వికెట్.. నెటిజన్లను ఆకట్టుకుంటోన్న వీడియో..!

Pakistan vs Bangladesh, 2nd Test: ఢాకా వేదికగా జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.

Watch Video: తొలిసారి బౌలింగ్ చేసిన బాబర్.. తృటిలో చేజారిన మొదటి వికెట్.. నెటిజన్లను ఆకట్టుకుంటోన్న వీడియో..!
Ban Vs Pak
Follow us
Venkata Chari

|

Updated on: Dec 08, 2021 | 8:34 AM

Pakistan vs Bangladesh, 2nd Test: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడని తెలిసిందే. వన్డే, టీ20, టెస్ట్ ఫార్మాట్లలో ధాటిగానే బౌలర్లపై విరుచకపడుతూ పరుగులు సాధిస్తున్నాడు. అయితే మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఢాకా టెస్టులో బాబర్ ఆజం బహుశా ఎవరూ ఊహించని పని చేసి వార్తల్లో నిలిచాడు. బాబర్ ఆజం తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలిసారి బౌలింగ్ చేశాడు. బంగ్లాదేశ్‌పై బాబర్ అజామ్ ఒక ఓవర్ బౌల్ చేశాడు. అతను వికెట్ దక్కించుకునే ఛాన్స్ కొద్దిలో మిస్ అయ్యాడు. బాబర్ ఒక ఓవర్‌ బౌలింగ్ చేసి ఒక పరుగు ఇచ్చాడు.

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 26వ ఓవర్‌లో బాబర్ అజామ్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఐదో బంతికి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ తైజుల్ ఇస్లామ్ తృటిలో తప్పించుకున్నాడు. బాబర్ అజామ్ వేసిన బంతి అతని బ్యాట్ అంచుని తాకి స్లిప్‌కు వెళ్లింది. అయితే అది ఫీల్డర్‌ను చేరుకోకముందే నేలపై పడింది. బాబర్ అజామ్ బౌలింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బంగ్లాదేశ్‌పై సాజిద్ ఖాన్ విధ్వంసం.. ఢాకా టెస్టులో రెండో, మూడో రోజుల ఆట నాలుగో రోజు వాష్‌ కావడంతో పాక్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ ఆతిథ్య జట్టును ఇబ్బందుల్లోకి నెట్టాడు. పాకిస్థాన్ రెండో సెషన్‌లో 4 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసి నాలుగో రోజు తన తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆపై ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ మ్యాజిక్ పని చేసింది. సాజిద్ కేవలం 35 పరుగులిచ్చి 6 వికెట్లు తీయడంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 76 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. కేవలం ఒక రోజు ఆట మిగిలి ఉండగా, ఫాలో-ఆన్‌ను కాపాడుకోవడానికి బంగ్లాదేశ్ ఇంకా 25 పరుగులు చేయాల్సి ఉండగా, జట్టు మూడు వికెట్లు మిగిలి ఉండగానే పాకిస్థాన్ కంటే 224 పరుగులు వెనుకబడి ఉంది. అనుభవజ్ఞుడైన షకీబ్ అల్ హసన్ స్టంప్స్ సమయానికి 23 పరుగులతో ఆడుతున్నాడు. తైజుల్ ఇస్లాం ఖాతా తెరవకుండానే అతనితో పాటు క్రీజులో ఉన్నాడు.

Also Read: IPL 2022 Mega Auction: యువ ఆటగాళ్లకు ఇదే చివరి అవకాశం.. సత్తా చాటితే కోటీశ్వరులే.. నేటి నుంచే విజయ్ హజారే ట్రోఫీ..!

IND vs SA: ఆ సీనియర్ ప్లేయర్‌కు ఇదే చివరి ఛాన్స్.. దక్షిణాఫ్రికా టూర్‌కు నేడే జట్టు ఎంపిక.. ఎవరికి చోటు దక్కనుందో?