YSRCP: ఏపీని ఆదుకోండి.. కేంద్రం అందించాల్సిన తోడ్పాటుపై అమిత్ షాకు వైసీపీ ఎంపీల విజ్ఞప్తి..

కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సినవాటిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వైసీపీ ఎంపీలు వినతి పత్రం సమర్పించారు. సోమవారం రాత్రి కేంద్ర మంత్రితో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ..

YSRCP: ఏపీని ఆదుకోండి.. కేంద్రం అందించాల్సిన తోడ్పాటుపై అమిత్ షాకు వైసీపీ ఎంపీల విజ్ఞప్తి..
Vijaysai Reddy
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 08, 2021 | 9:09 AM

కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సినవాటిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వైసీపీ ఎంపీలు వినతి పత్రం సమర్పించారు. సోమవారం రాత్రి కేంద్ర మంత్రితో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి, లోకసభ పక్ష నాయకుడు మిధున్ రెడ్డి సమావేశమ‌య్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలు, కేంద్రం అందించాల్సిన తోడ్పాటుపై ఈ సంద‌ర్భంగా విజయసాయి రెడ్డి వివరించారు. ఆయా అంశాలపై మెమోరాండాన్ని అందజేశారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల వ్యయానికి ఆమోదం తెలపాలని ఈ సందర్బంగా కోరారు. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసే దిశగా కేంద్రం సహకరించాలని ఆ వినతి పత్రంలో వారు విజ్ఞప్తి చేశారు. అలాగే ఏపీలో ఇటీవల సంభవించిన వరదల వల్ల జరిగిన తీవ్ర నష్టాన్ని కేంద్ర మంత్రి అమిత్ షాకు వివరించారు విజయసాయిరెడ్డి. ఆంధ్ర ప్రదేశ్‌కు వరద సహాయం చేయాలని ఈ సంద‌ర్భంగా వారు అమిత్ షాను కోరారు.

ఇవి కూడా చదవండి: చేపలు అమ్ముకునే మహిళను బస్సు ఎక్కనివ్వని అధికారులు.. కన్యాకుమారిలో ఆధునిక అనాగరికం..

Beauty Tips: చలికాలంలో జుట్టు, చర్మం పొడిబారడం వల్ల ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ హోం రెమెడీస్ ప్రయత్నించండి..