Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi-BBC: ప్రధాని మోడీకి అండగా లండన్‌లో BBC ఆఫీస్ ఎదుట భారతీయుల నిరసన.. బీబీసీపై అంతర్జాతీయ స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్

ప్రధాని నరేంద్ర మోడీ పై రూపొందించిన డాక్యుమెంటరీ అత్యంత పక్షపాతంతో కూడుకున్నదని ఎఫ్‌ఐఎస్ఐ యుకెకు చెందిన జయూ షా అన్నారు.  బీబీసీపై అంతర్జాతీయ స్థాయిలో విచారణ జరగాలని..  పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్‌గా తమ విధి నిర్వహణలో విఫలమైనందుకు బీబీసీ డైరెక్టర్ల బోర్డును విచారించాలని అన్నారు.

PM Modi-BBC: ప్రధాని మోడీకి అండగా లండన్‌లో BBC ఆఫీస్ ఎదుట భారతీయుల నిరసన.. బీబీసీపై అంతర్జాతీయ స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్
Protest Against Bbc In Uk
Follow us
Surya Kala

|

Updated on: Jan 30, 2023 | 8:21 AM

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై యుకెకు చెందిన ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. బీబీసీ  తీసిన వివాదాస్పద డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా UKలోని వందలాది మంది ప్రవాస భారతీయులు తమ గళం విప్పారు. ఆదివారం సెంట్రల్ లండన్‌లోని BBC ఆఫీస్ బయట ప్రదర్శన నిర్వహించారు. BBC వాక్ లండన్, మాంచెస్టర్, బర్మింగ్‌హామ్, గ్లాస్గోలోని BBC స్టూడియోల వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు భారతీయులు. ఈ నిరసన కార్యక్రమంలో  న్యూకాజిల్ గయా .. ఇండియన్ డయాస్పోరా UK (IDUK), ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఇంటర్నేషనల్ (FISI) UK, ఇన్‌సైట్ UK, హిందూ ఫోరమ్ ఆఫ్ బ్రిటన్ (HFB) వంటి సంస్థలు సంయుక్తంగా ఈ ప్రదర్శనను నిర్వహించాయి.

బీబీసీని బహిష్కరించు, బ్రిటీష్ బయాస్ కార్పొరేషన్, హిందూ ఫోబిక్ కథనాన్ని ఆపండి,.. షేమ్ బీబీసీ, భారత మాతకు జై వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను నిరసనకారులు ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ పై రూపొందించిన డాక్యుమెంటరీ అత్యంత పక్షపాతంతో కూడుకున్నదని ఎఫ్‌ఐఎస్ఐ యుకెకు చెందిన జయూ షా అన్నారు.

‘భారత వ్యతిరేక ప్రచారానికి వ్యతిరేకంగా గళం విప్పాలి’ బీబీసీపై అంతర్జాతీయ స్థాయిలో విచారణ జరగాలని..  పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్‌గా తమ విధి నిర్వహణలో విఫలమైనందుకు బీబీసీ డైరెక్టర్ల బోర్డును విచారించాలని అన్నారు. తన తల్లి శారీరక వైకల్యంతో వీల్‌ఛైర్‌ను ఉపయోగిస్తుంటుందని.. అయినప్పటికీ ఆమె.. బీబీసీ చూపిస్తున్న వివక్షతపై తన గళం విప్పుతూ.. నిరసన తెలియజేయడానికి వచ్చారని అన్నారు. BBC చూపిస్తున్న వివక్షత..   భారత వ్యతిరేక ప్రచారానికి వ్యతిరేకంగా అందరం స్వరం పెంచాల్సిన అవసరం ఉందన్నారు జయూ షా.

ఇవి కూడా చదవండి

యుకెకు చెందిన బీబీసీ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పై పీఎం క్వ‌శ్చ‌న్ పేరుతో డాక్యుమెంట‌రీని రూపొందించింది. రెండు భాగాలుగా  ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌సారమైంది. ఇందులో 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కొన్ని అంశాలను పరిశోధించాలని పేర్కొంది.  ఇప్ప‌టికే ఈ డాక్యుమెంట‌రీపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. పూర్తిగా మోడీ ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు చేస్తున్న ప్ర‌య‌త్న‌మ‌ని స్ప‌ష్టం చేసిన సంగతి తెలిసిందే..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..