AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Crisis: పాక్‌లో సంక్షోభానికి అల్లానే బాధ్యుడు.. ఆయనే మమ్మల్ని రక్షిస్తాడన్న ఆర్థిక మంత్రి

పాకిస్థాన్‌లో భారీ ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వంలోని అన్ని విభాగాల ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోతతో సహా పలు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ విచిత్రమైన ప్రకటన చేశారు. ఈ సమయంలో పాకిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులకు అల్లా బాధ్యుడని అన్నారు

Pakistan Crisis: పాక్‌లో సంక్షోభానికి అల్లానే బాధ్యుడు.. ఆయనే మమ్మల్ని రక్షిస్తాడన్న ఆర్థిక మంత్రి
Pakistan Finance Minister
Surya Kala
|

Updated on: Jan 28, 2023 | 10:54 AM

Share

దాయాది దేశం పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో  చిక్కుకుని అల్లాడుతోంది. ఆ దేశ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గోధుమ పిండి ప్యాకెట్ రూ.3000 వరకు విక్రయిస్తున్నారు. ఆ దేశ యువత ఉద్యోగం అన్న మాటే మర్చిపోయారు. ఆ దేశ ప్రజలు మళ్లీ మళ్లీ అంధకారాన్ని ఎదుర్కొంటున్నారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి భారీగా క్షీణించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ విచిత్రమైన ప్రకటన చేశారు. ఈ సమయంలో పాకిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులకు అల్లా బాధ్యుడని అన్నారు. “అల్లా పాకిస్తాన్‌ను సృష్టించగలిగితే అతనే మమ్మల్ని రక్షించగలడు, అభివృద్ధి చేయగలడు అని ఇషాక్ దార్ పేర్కొన్నట్లు ఆ దేశ ప్రముఖ వార్త సంస్థ PTI పేర్కొంది.

మన దేశం పురోగమిస్తుంది: దార్ ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన దార్.. ఇస్లాం పేరుతో దేశం నిర్మితమైందని.. తమ దేశం ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో పాకిస్థాన్ పరిస్థితిని మెరుగుపరిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. పీఎం షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం గత ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం నుండి సమస్యలను వారసత్వంగా పొందిందని దార్ అన్నారు. పీఎం షరీఫ్ ప్రభుత్వం పగలు రాత్రి పని చేస్తోందన్నారు.

ఇమ్రాన్ ఖాన్ లక్ష్యంగా విమర్శలు దార్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేరు చెప్పకుండానే ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ దుశ్చర్యల వల్లే పాకిస్థాన్‌ తీవ్ర ఇబ్బందులకు గురవుతోందని …  ఐదేళ్ల క్రితం ఈ ‘డ్రామా’ మొదలైందని అన్నారు. 2013 నుంచి 2017 మధ్య నవాజ్ షరీఫ్ నాయకత్వంలో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని కూడా ఆయన అన్నారు. దక్షిణాసియాలో పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అత్యుత్తమ క్యాపిటల్ మార్కెట్ అని.. నవాజ్ షరీఫ్ హయాంలో ఐదో స్థానంలో నిలిచిందని గుర్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

నవాజ్ హయాంలో పాకిస్థాన్ అభివృద్ధి పథంలో పయనించింది.. అయితే గత ప్రభుత్వం సమయంలో  పట్టాలు తప్పిందని ఆయన అన్నారు. గత ఐదేళ్లలో దేశం సృష్టించిన విధ్వంసాన్ని ప్రజలు చూడగలరని.. గతంలో ఎవరు ఏ విధంగా పనిచేశారో ప్రజలకు  తెలుసునని దార్ అన్నారు.

ఒక డాలర్ ధర 260 దాటింది నగదు కొరతతో ఉన్న పాకిస్థాన్ కరెన్సీ శుక్రవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ మార్కెట్ , బహిరంగ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూ.262.6 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో ఒక సమయంలో పాక్ కరెన్సీ బహిరంగ మార్కెట్‌లో రూ. 265 ..  ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారకపు మార్కెట్‌లో రూ. 266కి పడిపోయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రకారం.. శుక్రవారం మార్కెట్ ప్రారంభమైనప్పుడు, కరెన్సీ గురువారం ముగింపు ధర నుండి రూ.7.17 లేదా 2.73 శాతం క్షీణించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..