Jerusalem Shooting: యూదుల ప్రార్ధనా మందిరంపై ఉగ్రవాది కాల్పులు.. ఎనిమిది మంది మృతి..

ఇజ్రాయెల్‌లోని జెరూసలేం పట్టణం కాల్పులతో దద్దరిల్లింది. యూదుల పవిత్ర ఆలయంలో ఓ ఉగ్రవాది తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో..

Jerusalem Shooting: యూదుల ప్రార్ధనా మందిరంపై ఉగ్రవాది కాల్పులు.. ఎనిమిది మంది మృతి..
Jerusalem Shooting
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 28, 2023 | 9:10 AM

ఇజ్రాయెల్‌లోని జెరూసలేం పట్టణం కాల్పులతో దద్దరిల్లింది. యూదుల పవిత్ర ఆలయంలో ఓ ఉగ్రవాది తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, 10 మందికిపై గాయపడ్డారు. చాలామంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జెరూసలేంలోని నెవ్‌ యాకోవ్‌ బౌలేవార్డ్‌లో ఉన్న యూదుల ప్రార్థనా మందిరం వెలుపల ఓ ఉగ్రవాది కాల్పులకు తెగబడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారని.. 15 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. అయితే పోలీసుల కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తి పాలస్తీనాకు చెందిన వాడిగా గుర్తించారు. సమాచారం అందుకున్న ప్రధాని నెతన్యాహు ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. ఇటీవలి కాలంలో జెరూసలేంలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదేనని పోలీసులు తెలిపారు.

ఈ దాడిని ఇజ్రాయెల్ తీవ్రవాద దాడిగా పేర్కొంది. జెరూసలేం ఆక్రమణలో ఉన్న యూదుల ప్రాంతమైన నెవ్ యాకోవాలో ఈ ఉగ్ర దాడి జరిగినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ, ఒక సాయుధుడు అకస్మాత్తుగా కాల్పులు జరిపాడడని.. దాడి చేసిన వ్యక్తి కూడా హతమయ్యాడని తెలిపింది. తొలుత మృతుల సంఖ్య 5గా చెప్పగా, ఆ తర్వాత మృతుల సంఖ్య 5 నుంచి 8కి పెరిగిందని పేర్కొంది.

ఇదిలాఉంటే.. శుక్రవారం ఉదయం పాలస్తీనాలోని గాజా ట్రిప్‌లో ఇజ్రాయెల్‌ సైనికులు దాడిచేశారు. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు సహా 10 మంది మృతిచెందారు. అయితే, టెర్రరిస్టుల కార్యకలాపాలను నిలువరించడానికే ఈ దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటనలో తెలిపింది. ఇది జరగిన కొన్ని గంటల్లోనే జెరుసలేంలో కాల్పుల ఘటన జరిగింది. ఈ ఉగ్రదాడి తర్వాత పాలస్తీనాలో సంబరాలు మిన్నంటాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..