Afghanistan: తాలిబన్ల అరాచకం.. ఆఫ్ఘన్ మహిళలకు ఉన్నత విద్య ఇక అందని ద్రాక్షే..

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇక్కడ మహిళలు, బాలికలు హింసకు గురవుతున్నారు. వారి హక్కులకు భంగం కలుగుతోంది. వారిపై దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలు, బాలికల స్వేచ్ఛపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తూనే ఉన్నారు.

Afghanistan: తాలిబన్ల అరాచకం.. ఆఫ్ఘన్ మహిళలకు ఉన్నత విద్య ఇక అందని ద్రాక్షే..
Taliban Bans Women Education
Follow us
Surya Kala

|

Updated on: Jan 29, 2023 | 8:50 AM

ఆఫ్ఘనిస్తాన్ లో పాలన చేపట్టిన సమయంలో తాలిబన్లు చెప్పింది ఒకటి.. ఆచరిస్తున్న విధానాలు మరొకటిగా ఉన్నాయి. ఆ దేశంలో తాలిబన్ల అరాచక పాలన కొనసాగుతూనే తుంది.  2021 ఆగస్టులో అధికారం చేపట్టిన తర్వాత, తాలిబాన్ మహిళలకు అన్ని హక్కులను కల్పిస్తామని హామీ ఇచ్చింది.. అయితే క్రమంగా తమ వాగ్దానాన్నిపక్కకు పెట్టి.. మహిళల స్వేచ్ఛ, చదువుపై ఆంక్షలను విధిస్తునే ఉంది. ఆ దేశంలో తాలిబన్ల నిర్ణయాలతో మహిళలు, బాలికల ప్రాధమిక హక్కులకు భంగం కలుగుతోంది.

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇక్కడ మహిళలు, బాలికలు హింసకు గురవుతున్నారు. వారి హక్కులకు భంగం కలుగుతోంది. వారిపై దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలు, బాలికల స్వేచ్ఛపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తూనే ఉన్నారు. చదువుకోనివ్వడం లేదు, ఉద్యోగాలు చేయకుండా నిషేధం విధించారు. చివరికి బట్టల షాప్స్ లో ఉండే మహిళ బొమ్మలపై కూడా తాలిబన్లు పలు ఆంక్షలు విధించి సంచలనం సృష్టించారు.

తాజాగా తాలిబన్లు మహిళా విద్యార్థులకు సంబంధించి మరో ఉత్తర్వు ఇచ్చారు. విద్యారంగానికి ‘శత్రువు’ అయిన తాలిబన్లు, మహిళా విద్యార్థులను యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలకు అనుమతించవద్దని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం..  తాలిబాన్ ఆధ్వర్యంలోని ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ఈ ఉత్తర్వును ఆఫ్ఘనిస్తాన్‌లోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు పంపింది. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో వచ్చే నెలలో జరగనున్న విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలకు మహిళా విద్యార్ధులకు అనుమతి లేదు.

ఇవి కూడా చదవండి

గతేడాది డిసెంబర్‌లో తాలిబన్ ప్రభుత్వం మహిళలు విద్యను అభ్యసించేందుకు యూనివర్సిటీకి వెళ్లడాన్ని నిషేధించింది. తాలిబాన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్‌తో పాటు ప్రపంచంలోని అనేక ముస్లిం దేశాలు ఖండించాయి. డిసెంబర్ 20న, తాలిబాన్ మహిళలు విద్యను అభ్యసించడానికి విశ్వవిద్యాలయాలకు వెళ్లడాన్ని నిరవధిక నిషేధం విధించింది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత, బాలికలను విశ్వవిద్యాలయానికి వెళ్లకుండా నిలిపివేశారు.

అంతకుముందు నవంబర్‌లో  పార్కులు, ఫెయిర్లు, జిమ్‌లు వంటి వాటికీ వెళ్ళడానికి వీలులేకుండా స్త్రీలపై తాలిబాన్ నిషేధించింది. దీంతో మహిళలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. అదే సమయంలోఇపుడు బాలికలను చదువుకు పూర్తిగా దూరం చేసింది. 2021 ఆగస్టులో అధికారం చేపట్టిన తర్వాత.. తాలిబాన్ మహిళలకు అన్ని హక్కులను కల్పిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాదు తాము మానవ హక్కులను ఉల్లంఘించబోమని చెప్పారు.

అయితే వాగ్దానాల ఒకలా ఉంటె.. అక్కడ వాస్తవికత మరొలా ఉంది. అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత తాలిబన్లు క్రమంగా తమ బుద్ధిని బయటపెట్టుకున్నారు.. తాము ఇచ్చిన వాగ్దానాలు తూచ్ అంటూ వెనక్కి తీసుకున్నారు. దీంతో ఆ దేశ మహిళలు , బాలికలు   స్వేచ్ఛను కోల్పోయారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..