US Firing: బెవర్లీ క్రెస్ట్‌లో దుండగుడు కాల్పులు.. ముగ్గురు మృతి.. వరస ఘటనలతో ఉలిక్కిపడుతున్న ప్రజలు
కాల్పుల ఘటనలతో కాలిఫోర్నియా దద్దరిల్లుతుంది. దుండగులు అమాయకులను పొట్టనపెట్టుకుంటున్నారు. తాజా కాల్పుల్లో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, మరో నలుగురు తీవ్రంగా పడ్డారు. లాస్ ఏంజిల్స్‌కు అతి సమీపంలోని బెవర్లీ క్రెస్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జనసమూహంలో కలిసిపోయిన దుండగుడు హఠాత్తుగా కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాలిఫోర్నియాలో ఈ నెలలో కాల్పులు జరగడం ఇది నాలుగో సారి. లాస్‌ఏంజిల్స్ సమీపంలోని మాంటేరీ పార్క్‌లో ఈ మధ్యనే కాల్పులు చోటు చేసుకున్నాయి.
చైనీయుల లూనార్ నూతన సంవత్సర వేడుకల్లో దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 10 మందిని పొట్టనపెట్టుకున్నాడు. ఆ తర్వాత హాఫ్‌మూన్ బే ప్రాంతంలో రెండుచోట్ల దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. మరోవైపు షికాగోలో తెలుగు విద్యార్థులపై నల్ల జాతీయులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన నందపు దేవ్‌శిష్ అనే విద్యార్థి మృతిచెందగా, కొప్పాల సాయి చరణ్ గాయాలపాలయ్యాడు. విశాఖపట్నానికి చెందిన లక్ష్మణ్ కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్నాడు. వరుస ఘటనలు జనం గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. దుండగుల చర్యలపై పోలీసులు ఫోకస్ పెంచారు. వరుస ఘటనల నేపథ్యంలో బందోబస్తు పెంచారు. రద్దీ ప్రదేశాలపై మరింత దృష్టి సారించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..