Germany: చర్చిలో కాల్పులకు తెగబడిన దుండగుడు.. ఏడుగురు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు..పరిస్థితి విషమం..

కాగా, 12 సార్లు కాల్పుల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు.

Germany: చర్చిలో కాల్పులకు తెగబడిన దుండగుడు.. ఏడుగురు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు..పరిస్థితి విషమం..
Germany Shooting
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 10, 2023 | 3:14 PM

చర్చికి వచ్చిన ప్రజలపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడిన ఘటన జర్మనీలోని హంబర్గ్ నగరంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అనేక మంది చనిపోగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. చర్చీలో కాల్పుల స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘ‌టనాస్థ‌లానికి చేరుకున్నారు. స్థానికుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. ప్ర‌జ‌లంతా ఇళ్ల‌లోనే ఉండాల‌ని సూచించారు. క్ష‌తగాత్రుల‌ను ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. కాల్పుల‌కు పాల్ప‌డిన దుండ‌గుడు కూడా తనను తాను కాల్చుకుని మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని స్థానిక మీడియా వెల్ల‌డించింది.

వారంవారం నిర్వ‌హించే బైబిల్ ప‌ఠ‌నం కార్య‌క్ర‌మంలో భాగంగా ప‌లువురు డీల్‌బోజ్ వీధిలోగల మూడంతస్తుల చర్చి భవనంలోకి వ‌చ్చారు. అదే స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దుండగుడు భవనం నుంచి బయటికి పారిపోయినట్లుగా ఎలాంటి ఆనవాళ్లు లేవని, కాబట్టి కాల్పుల అనంతరం దుండుగుడు తనను కాల్చుకుని మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, 12 సార్లు కాల్పుల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని పోలీసు అధికార ప్రతినిధి హోల్గర్ వెహ్రెన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ కాల్పులపై  నగర మేయర్ పీటర్ షెంచర్ ట్విట్టర్‌లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎమర్జెన్సీ సర్వీసెస్ కృషి చేస్తున్నాయని చెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!