కరీంనగర్ లో కాంగ్రెస్ జోరు.. హాత్ సే హత్ జోడో యాత్ర మొదటి విడత ముగింపు సభ.. అట్టహాసంగా..
తెలంగాణ ప్రజలు కేసీఆర్ పై కోపంతో బీజేపీకి ఓటేస్తే పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లు అవుతుందని.. ఆ తప్పు చేయవద్దని రేవంత్ తెలంగాణ సమాజాన్ని కోరారు.

కరీంనగర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ కవాతు సభ నిర్వహించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హత్ జోడో యాత్ర మొదటి విడత ముగింపు సందర్భంగా నిర్వహించిన ఈసభకు ముఖ్య అతిథులుగా ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్‌బగేల్, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ , రాష్ట్ర ఇన్‌చార్జి ఠాక్రే హాజరయ్యారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలేనని, దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ దొందూ దొందే.. అన్నారు ఠాక్రే. సోనియా కలలుగన్న సామాజిక తెలంగాణ ఏర్పడాలంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని.. ఆ దిశగా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని ఠాక్రే పిలుపు ఇచ్చారు.
రాష్ట్రానికి కావాల్సింది తెలంగాణ మాడల్ కాదని ఛత్తీస్‌గడ్ మాడల్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పై కోపంతో బీజేపీకి ఓటేస్తే పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లు అవుతుందని.. ఆ తప్పు చేయవద్దని రేవంత్ తెలంగాణ సమాజాన్ని కోరారు.




మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..