AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో దారుణం.. ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి.. ఒకే రోజు ఇన్నా..

మరోవైపు మేడ్చల్ జిల్లా... పీర్జాది గూడ, బుద్దా నగర్ లో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి భూపాల్ రెడ్డిపై కుక్కలు ఎటాక్‌ చేశాయి. ఉదయం వాకింగ్ కి వెళ్లి వస్తుండగా వీధి కుక్కలు దాడిచేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.

మరో దారుణం.. ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి.. ఒకే రోజు ఇన్నా..
Jyothi Gadda
|

Updated on: Mar 09, 2023 | 10:14 PM

Share

నిన్నగాక మొన్న ప్రదీప్‌ని పొట్టనపెట్టుకున్న కుక్కలు… గత కొద్దిరోజులుగా నగరంలో భీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ ఒక్క రోజే రెండు చోట్ల కుక్కలు జనంపై ఎటాక్‌ చేశాయి. కుక్కల వరుస దాడులకు పసిపిల్లలు బలైపోతున్న దుర్ఘటనలు తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. కుక్కల దాడులతో పసిబిడ్డలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో మరోసారి వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. అత్తాపూర్ డివిజన్ తేజస్వి నగర్ కాలనీలో సన్‌రైజ్‌ టవర్స్ దగ్గర ఓ మూడేళ్ళ చిన్నారిని వదిలి…పిల్లాడి తల్లీతండ్రీ కూలి పనిలోకి వెళ్ళారు. రెండేళ్ల బాబు అక్కడే ఆడుకుంటుండగా దాదాపు పదిపన్నెండు వీధి కుక్కలు పిల్లాడిపై హఠాత్తుగా ఎటాక్‌ చేశాయి. దీంతో హడలిపోయిన మూడేళ్ళ పసివాడు ఏడుపులంకించుకున్నాడు. కుక్కలు బాలుడిని తరుముకుంటూ వెంబడించాయి. పిల్లవాడి ఏడుపు విన్న స్థానికులు పరిగెత్తుకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. కుక్కలను తరిమేసి, బాలుడిని కాపాడారు స్థానికులు…

మరోవైపు మేడ్చల్ జిల్లా… పీర్జాది గూడ, బుద్దా నగర్ లో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి భూపాల్ రెడ్డిపై కుక్కలు ఎటాక్‌ చేశాయి. ఉదయం వాకింగ్ కి వెళ్లి వస్తుండగా వీధి కుక్కలు దాడిచేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.

గతంలో కూడా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో చిన్నారులపై కుక్కలు దాడి చేశాయి. అయితే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఘటన జరిగినప్పుడు హడావుడి చేసి ఆ తరువాత మర్చిపోతున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
మళ్లీ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్, వంశిత.. ఫొటోస్ ఇదిగో
మళ్లీ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్, వంశిత.. ఫొటోస్ ఇదిగో