దేశ అధ్యక్షురాలిపైనే నిషేధం విధించిన విమానయాన సంస్థ.. ఎక్కడంటే

సాధారణంగా విమానయాన సంస్థలు ప్రయాణికులెవరైన తప్పు చేస్తే వారిపై నిషేధం విధిస్తుంటాయి. కానీ జార్జీయ దేశానికి చెందిన జార్జియన్ ఎయిర్‌వేస్ అనే సంస్థ ఏకంగా ఆ దేశ అధ్యక్షురాలిపైనే నిషేధం విధించింది. జార్జియ అధ్యక్షురాలు శాలోమ్ జౌరాబిష్‌విలి ఇటీవల రష్యాకు విమాన సర్వీసులు పునరుద్ధరించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశ అధ్యక్షురాలిపైనే నిషేధం విధించిన విమానయాన సంస్థ.. ఎక్కడంటే
Flight
Follow us
Aravind B

|

Updated on: May 22, 2023 | 4:03 AM

సాధారణంగా విమానయాన సంస్థలు ప్రయాణికులెవరైన తప్పు చేస్తే వారిపై నిషేధం విధిస్తుంటాయి. కానీ జార్జీయ దేశానికి చెందిన జార్జియన్ ఎయిర్‌వేస్ అనే సంస్థ ఏకంగా ఆ దేశ అధ్యక్షురాలిపైనే నిషేధం విధించింది. జార్జియ అధ్యక్షురాలు శాలోమ్ జౌరాబిష్‌విలి ఇటీవల రష్యాకు విమాన సర్వీసులు పునరుద్ధరించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందుకు ప్రతిస్పందనగా ఈ విమానయాన సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. జార్జియాతో విమాన సర్వీసులపై నాలుగేళ్లపాటు నిషేధం విధించిన రష్యా ఇటీవలే ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.

అలాగే రష్యాకు వచ్చే జార్జియన్ల వీసా పరిమితులపై సడలింపులు కూడా ఇస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన జార్జియా అధ్యక్షురాలు శాలోమ్‌ జౌరాబిష్‌విలి.. రష్యా చొరవను అడ్డుకోవాలని తమ పౌరులను కోరారు. రష్యాపై విధిస్తున్న ఆంక్షలను పాటించాలని అమెరికా, ఈయూ చేస్తున్న విజ్ఞప్తులకు అనుగుణంగా రష్యా ప్రతిపాదనకు లొంగవద్దని ఆమె పిలుపునిచ్చారు. కానీ జార్జియన్ విమానయాన సంస్థ అధ్యక్షురాలు చెప్పిన దానిని లెక్కచేయలేదు. తమ విమానాన్ని మాస్కోకు పంపించింది. దీనిపై స్పందిచిన అధ్యక్షురాలు ఆ విమానంలో ప్రయాణించనని ప్రకటించారు. ఇలా ఆ అధ్యక్షురాలు హెచ్చరికలపై జార్జియన్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకురాలు తమాజ్‌ డయాస్‌విలి కూడా స్పందించారు. జార్జియన్‌ ప్రజలకు క్షమాపణలు చెప్పేంతవరకు అధ్యక్షురాలిని తమ విమానాల్లో అనుమతించబోమని, నిషేధం విధిస్తున్నామని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..