OMG: టాయిలెట్‌కి వెళ్లొద్దన్న ఎయిర్ హోస్టెస్.. కోపంలో ఎవరూ ఊహించని పని చేసిన ప్యాసింజర్..
ఇటీవలి కాలంలో విమానంలో మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేయడం వంటి ఘటనలు చాలా వెలుగు చూశాయి. విమానంలోనే కాదు.. బస్సుల్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే, తాజాగా అంతకు మించిన ఘటన చోటు చేసుకుంది. విమానంలో టాయిలెట్ వెళ్లేందుకు ఎయిర్ హోస్టెస్ నిరాకరించిందని..
ఇటీవలి కాలంలో విమానంలో మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేయడం వంటి ఘటనలు చాలా వెలుగు చూశాయి. విమానంలోనే కాదు.. బస్సుల్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే, తాజాగా అంతకు మించిన ఘటన చోటు చేసుకుంది. విమానంలో టాయిలెట్ వెళ్లేందుకు ఎయిర్ హోస్టెస్ నిరాకరించిందని.. ఓ ప్రయాణికుడు కూర్చున్న సీటుపైనే మూత్ర విసర్జన చేశాడు. దుబాయ్ నుంచి మాంచెస్టర్ వెళ్తున్న ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. 39 ఏళ్ల లాయిడ్ జాన్సన్ దుబాయ్ నుంచి మాంచెస్టర్ వెళ్తున్న ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్నాడు. అయితే, విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో టాయిలెట్ వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే, ఎయిర్ హోస్టెస్ అంగీకరించలేదు. దాంతో ఎయిర్‌హోస్టెస్‌తో వాగ్వాదానికి దిగాడు. అదే కోపంలో సీట్ పైనే మూత్ర విసర్జన చేశాడు. అయితే, విమానం దిగిన వెంటనే.. లాయిడ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా.. మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. కోర్టులో ప్రవేశపెట్టగా.. లాయిడ్‌కు కోర్టు 510 పౌండ్ల జరిమానా విధించింది. భారతీయ కరెన్సీలో రూ. 52,626. ఎవరికీ హానీ చేయకపోవడంతో.. అతనికి కేవలం జరిమానాతో మాత్రమే సరిపెట్టారు.
వాస్తవానికి.. విమానంలో ప్రయాణిస్తే టేకాఫ్ సమయంలో, ల్యాండింగ్ సమయంలో, టాక్సీ మోడ్‌లో ఉన్నప్పుడు ఎవరినీ టాయిలెట్‌కు అనుమతించరు. భద్రతా కారణాల రిత్యా ఈ నిబంధనను పెట్టారు. ఎవరైనా సరే నియమానికి అతీతులు కాదు. అందుకే.. అతన్ని ఎయిర్‌హోస్టెస్ ఆపడం జరిగింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..