Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fatima Bhutto Marriage: శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన పాకిస్తాన్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో మనవరాలు.. వివాహం తర్వాత..

పాక్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో మనవరాలు ఫాతిమా భుట్టో వివాహం జరిగింది. వివాహానంతరం హిందూ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఫాతిమా ఒక్కసారిగా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

Fatima Bhutto Marriage: శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన పాకిస్తాన్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో  మనవరాలు.. వివాహం తర్వాత..
Fatima Bhutto Marriage
Follow us
Sanjay Kasula

|

Updated on: May 02, 2023 | 9:03 PM

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో మనవరాలు ఫాతిమా భుట్టో వివాహం ఘనంగా జరిగింది. అయితే వివాహం అనంతరం ఈ జంట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం పాకిస్తాన్ చర్చకు దారి తీసింది. తన వివాహానంతరం హిందూ దేవాలయాన్ని సందర్శించి సరికొత్త ఉదాహరణగా నిలిచింది. ఫాతిమా వేసిన ఈ స్టెప్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. కొంతమంది నెటిజన్లు ఫాతిమా కదమ్‌ను చాలా అభినందిస్తున్నారు. ఫాతిమా మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో మనమరాలు, ముర్తాజా భుట్టో కుమార్తె..  వృత్తి రీత్యా రచయిత్రి, కాలమిస్ట్ అయిన ఫాతిమా భుట్టో శుక్రవారం అమెరికా పౌరుడు గ్రాహం (గిబ్రాన్)ని వివాహం చేసుకుంది. వివాహం అనంతరం ఆదివారం నాడు ఫాతిమా తన భర్తతో కలిసి కరాచీలోని చారిత్రాత్మక మహాదేవ్ ఆలయాన్ని సందర్శించారు.

శివుడికి ప్రీతిపాత్రమైన పాలభిషేకం నిర్వహిచారు. రుద్రుడికి ప్రత్యేక పూజలు చేశారు. వీరు పూజలు చేస్తున్న ఫోటో ఒకటి షోషల్ మీడియాను కుదిపేసింది. అంతకుముందు, ఫాతిమా వివాహ వేడుకకు దేశ విదేశాంగ మంత్రి, బావ బిలావల్ భుట్టో దూరంగా ఉన్నారు.

మీడియా కథనాల ప్రకారం, ఫాతిమా భర్త గ్రాహం క్రిస్టియన్, అమెరికన్ పౌరుడు. ఫాతిమాతో పాటు ఆమె సోదరుడు జుల్ఫికర్ అలీ భుట్టో జూనియర్.. హిందూ నాయకులు కూడా ఉన్నారు. ఆలయంలో దర్శన సమయంలో ఫాతిమా కూడా మహాదేవునికి ఆవు పాలుతో అభిషేకం చేశారు. ఫాతిమా, ఆమె భర్త ఈ చర్యపై ప్రజలు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు లభించింది.

ఫాతిమా భుట్టో కుటుంబం

సైనిక తిరుగుబాటు అనంతరం జుల్ఫికర్ అలీ భుట్టోను 1979 ఏప్రిల్‌లో అప్పటి సైనిక నియంత జియా-ఉల్-హక్ ఉరితీసిన సంగతి తెలిసిందే. జుల్ఫికర్ పెద్ద కుమార్తె బెనజీర్ భుట్టో డిసెంబర్ 2007లో రావల్పిండిలో హత్యకు గురైంది. సెప్టెంబర్ 1996లో, బెనజీర్ సోదరుడు ముర్తజా భుట్టో కూడా క్లిఫ్టన్‌లో హత్యకు గురయ్యారు. ముర్తాజా తమ్ముడు షానవాజ్ భుట్టో 1985లో ఫ్రాన్స్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించాడు.

ఫాతిమా భుట్టో గురించి

ఫాతిమా భుట్టో కాబూల్‌లో జన్మించారు. ఆమె సిరియా, కరాచీలలో పెరిగారు. నార్డ్ కళాశాల నుంచి బ్యాచిలర్ డిగ్రీని, లండన్లోని SOAS విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం