AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donald Trump: చిక్కుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు.. ట్రంప్‌ సీక్రెట్‌ డెన్‌లో FBI సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం

న్యూక్రియర్‌ బాంబలు, ఎనర్జీకి సంబంధించిన డాక్యుమెంట్లనూ ట్రంప్‌ కాపీ చేసి పెట్టుకున్నట్లు తేలింది. అటు ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి సంబంధించిన పత్రాలు ఉన్నట్లు సమాచారం. అసలు ట్రంప్‌ వీటితో ఏం చేస్తున్నారు? ఈ డాక్యుమెంట్లు బహిర్గతమైతే అమెరికాకి కచ్చితంగా హాని కలిగిస్తాయని భావిస్తున్నారు.

Donald Trump: చిక్కుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు.. ట్రంప్‌ సీక్రెట్‌ డెన్‌లో FBI సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం
Donald Trump
Surya Kala
|

Updated on: Aug 13, 2022 | 6:50 AM

Share

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ని కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఆయన విలాసవంతమైన రిసార్ట్‌ మార్‌-ఎ-లాగోలో FBI కొన్నిరోజుల క్రితం సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో FBI అధికారులకే దిమ్మతిరిగే డాక్యుమెంట్లు బయటపడ్డాయని తెలుస్తోంది. భారీగా 11 సెట్ల రహస్య పత్రాలను ఫెడరల్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 20బాక్సుల్లో ఈ పత్రాలను హెడ్‌క్వార్టర్స్‌కు తరలించినట్లు సమాచారం. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ట్రంప్‌కి విలాసవంతమైన రిసార్ట్‌ ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడన్న ట్యాగ్‌తోపాటు, ఆ దేశంలో టాప్‌ ఇండస్ట్రియలిస్ట్‌ కావడంతో ఇక్కడ టైట్‌ సెక్యూరిటీ ఉంటుంది. అయితే అమెరికా ప్రభుత్వం, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ ఆదేశాలతో.. ట్రంప్‌ విషయంలో FBI జోక్యం చేసుకుంది.

మార్‌ ఎ లాగో రిసార్ట్‌లో సోదాల్లో ప్రభుత్వ రహస్య పత్రాలతోపాటు.. ఫొటోలు, నోట్‌లు అధికారులకు దొరికాయి. దొరికిన 11 సెట్ల డాక్యుమెంట్స్‌లో నాలుగు సెట్‌ల టాప్‌సీక్రెట్‌ పత్రాలు, మూడు సెట్ల సీక్రెట్‌ పత్రాలు, మరో నాలుగు సెట్ల కాన్ఫిడెన్షియల్‌ పత్రాలున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. చేత్తో రాసిన నోట్లు, ఫొటోగ్రాఫ్స్‌ కూడా ట్రంప్‌ రిసార్ట్‌ నుంచి స్వాధీనం చేసుకున్నారు. దొరికిన పత్రాల్లో రోజర్‌ స్టోన్‌కి క్షమాభిక్ష పెట్టిన డాక్యెమెంట్స్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 2019లో ట్రంప్‌ స్నేహితుడు, రోజర్‌స్టోన్‌కి క్షమాభిక్ష దొరికింది. ఆ సమయంలో ట్రంపే వాటిపై సంతకాలు పెట్టారు. రోజర్‌ స్టోన్‌ 2016 ఎన్నికల్లో రష్యా కలుగజేసుకుందా అన్నదానిపై రోజర్‌ స్టోన్‌ అమెరికా కాంగ్రెస్ కి అబద్దాలు చెప్పినట్లు కేసు బుక్‌ అయింది. మూడేళ్ల జైలు శిక్ష కూడా పడడంతో ట్రంప్‌ ఆ శిక్షను రద్దుచేస్తూ క్షమాభిక్ష పెట్టారు.

టాప్‌ సీక్రెట్‌ పత్రాల్లో అమెరికా రక్షణ శాఖకు సంబంధించిన విలువైన సమాచారం ఉన్నట్లు సన్నిహిత వర్గాలంటున్నాయి. అంతేకాదు.. న్యూక్రియర్‌ బాంబలు, ఎనర్జీకి సంబంధించిన డాక్యుమెంట్లనూ ట్రంప్‌ కాపీ చేసి పెట్టుకున్నట్లు తేలింది. అటు ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి సంబంధించిన పత్రాలు ఉన్నట్లు సమాచారం. అసలు ట్రంప్‌ వీటితో ఏం చేస్తున్నారు? ఈ డాక్యుమెంట్లు బహిర్గతమైతే అమెరికాకి కచ్చితంగా హాని కలిగిస్తాయని భావిస్తున్నారు. ఇటీవల FBI ట్రంప్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ సమయంలో ఫిఫ్త్‌(fifth ) అమెండ్‌మెంట్‌ని తెరపైకి తీసుకొచ్చారు ట్రంప్‌. FBIకి తనను ప్రశ్నించే అధికారం లేదని అంటున్నారు ట్రంప్‌ .ఇక్కడే మాజీ అధ్యక్షుడు దొరికిపోయారని. తాను తప్పుచేయనప్పుడు ఈ చట్టం గురించిన ప్రస్తావన ఎందుకంటున్నారు వారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..