China Rains: డ్రాగన్ కంట్రీపై ప్రకృతి కన్నెర్ర.. కుండపోత వర్షాలు.. ఇళ్లు, రోడ్లు, పంటలు ధ్వంసం.. భారీ నష్టం

జొంగ్‌యాంగ్‌ కౌంటీ ప్రాంతంలో 13 గంటల పాటు కుండపోత వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. కౌంటీకి సమీపంలోని జిన్లువో గ్రామంలో అత్యధికంగా 20 సెం.మీ వర్షపాతం నమోదైంది.ఈ ఏడాది కురిసిన వర్షాల్లో ఇదే అత్యధికమని వివరించారు.

China Rains: డ్రాగన్ కంట్రీపై ప్రకృతి కన్నెర్ర.. కుండపోత వర్షాలు.. ఇళ్లు, రోడ్లు, పంటలు ధ్వంసం.. భారీ నష్టం
China Rains Floods
Follow us

|

Updated on: Aug 13, 2022 | 7:09 AM

China Rains: ప్రపంచంలో అమెరికా, దక్షిణ కొరియా, యురేపియన్ దేశాలు, చైనా సహా అనేక దేశాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా డ్రాగన్ కంట్రీలో ఆకాశం చిల్లు ప‌డిందా అన్నట్లు కుండపోత వర్షం కురుస్తోంది. చైనాను వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయి. దీంతో ప్రజ‌లు బెంబేలెత్తిపోయారు. ఉత్తర చైనా షాంగ్సీ ప్రావిన్స్‌లోని జొంగ్‌యాంగ్‌ కౌంటీపై ప్రకృతి కన్నెర్ర చేసింది. కుండపోత వర్షాల వ‌ల్ల ఆ ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. కధాటిగా కురిసిన వర్షంతో జొంగ్‌యాంగ్‌ కౌంటీలోని ప్రజలు వ‌ణికిపోయారు. పర్వత ప్రాంతం నుంచి భారీగా వరదలు పోటెత్తాయి. దీంతో ఇళ్లు, రోడ్లు, పంటలు ధ్వంసమయ్యాయి. ప్రవాహా ఉద్ధృతికి కార్లు కొట్టుకుపోయాయి. పలు దుకాణాల్లోకి వర్షపు నీరు చేరి నిత్యవసరాలు తడిసి ముద్దయ్యాయి.

జొంగ్‌యాంగ్‌ కౌంటీ ప్రాంతంలో 13 గంటల పాటు కుండపోత వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. కౌంటీకి సమీపంలోని జిన్లువో గ్రామంలో అత్యధికంగా 20 సెం.మీ వర్షపాతం నమోదైంది.ఈ ఏడాది కురిసిన వర్షాల్లో ఇదే అత్యధికమని వివరించారు. ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం నుంచి అక్కడి రహదారులు కోలుకుంటున్నాయి. రోడ్లపైకి భారీగా బురద వచ్చి చేరడం వల్ల అధికారులు తొలగిస్తున్నారు.

ప్రకృతి విపత్తు అనంతరం.. పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నట్లు జొంగ్‌యాంగ్‌ కౌంటీ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ బ్యూరో డైరెక్టర్ చెప్పారు. పర్వత ప్రాంతాల నుంచి సంభవించిన వరదల్లో ఐదుగురు రహదారి నిర్మాణ కార్మికులు కొట్టుకుపోయినట్లు తెలిపారు. మరోవైపు రానున్న మూడు రోజుల్లో జొంగ్‌యాంగ్‌ కౌంటీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆ ప్రాంత వాతావరణ విభాగం అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పలు చోట్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..