Samsung: సామ్ సంగ్ వారసుడికి క్షమాబిక్ష.. త్వరలోనే కంపెనీ బాధ్యతలు చేపట్టనున్న లీజే యాంగ్

ఆర్థిక కారణాలతో అవినీతికి పాల్పడిన వ్యాపారవేత్తలకు క్షమాబిక్ష ప్రసాదించే దక్షిణ కొరియా సంప్రదాయం సామ్ సంగ్ వారసుడి లీజే యాంగ్ కి కలిసొచ్చింది. దక్షిణ కొరియా అధ్యక్షులు యూన్ సుక్-యోల్

Samsung: సామ్ సంగ్ వారసుడికి క్షమాబిక్ష.. త్వరలోనే కంపెనీ బాధ్యతలు చేపట్టనున్న లీజే యాంగ్
Samsung
Follow us

|

Updated on: Aug 13, 2022 | 7:54 AM

Samsung: ఆర్థిక కారణాలతో అవినీతికి పాల్పడిన వ్యాపారవేత్తలకు క్షమాబిక్ష ప్రసాదించే దక్షిణ కొరియా సంప్రదాయం సామ్ సంగ్ వారసుడి లీజే యాంగ్ కి కలిసొచ్చింది. దక్షిణ కొరియా అధ్యక్షులు యూన్ సుక్-యోల్ Yoon Suk-yeol క్షమాబిక్ష ప్రసాదించడంతో త్వరలోనే సామ్ సంగ్ కంపెనీ బోర్డులో చేరి పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టనున్నారు లీజే యాంగ్. లంచం కేసులో దోషిగా తేలి జైలుశిక్షను ఎదుర్కొంటున్న, ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెన శాంసంగ్ వారసుడు లీజే యాంగ్ దక్షిణ కొరియా ప్రభుత్వం నుండి క్షమాభిక్షను పొందడం ద్వార సంవత్సరం జైలు శిక్ష ఉండగానే యాంగ్‌కు కేసు నుంచి విముక్తి లభించబోతోంది. ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని జైలులో ఉన్న వ్యాపార ప్రముఖులకు అక్కడి ప్రభుత్వం కేసుల నుంచి విముక్తి కల్పించడం దక్షిణ కొరియాలో ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. రేపు (ఆగష్టు 15)న దక్షిణ కొరియా లిబరేషన్ డేను పురస్కరించుకొని 1700 మంది దోషులకు అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ క్షమాభిక్ష పెట్టనున్నారు. దీనిలో లీజే యాంగ్ కు అవకాశం దక్కింది.

సామ్ సంగ్ గ్రూప్ అధినేత లీకున్ హీ పెద్ద కుమారుడు యాంగ్. అతను వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. 2017లో లంచం కేసులో అరెస్టయ్యారు. శాంసంగ్ రెండు అనుబంధ కంపెనీల విలీనానికి ప్రభుత్వం నుంచి అనుమతులు పొందేందుకు ఆయన 2015లో దేశాధ్యక్షురాలు పార్క్ గ్వెన్ కి లంచం ఇచ్చారన్న ఆరోపణలపై అరెస్ట్ చేశారు. తర్వాత న్యాయస్థానం 4 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కుంభకోణం బయటపడిన తర్వాత పార్క్ గ్వెన్ ప్రభుత్వం కూలిపోయింది. తనకు విధించిన శిక్షపై యాంగ్ అప్పీలేట్ కోర్టును ఆశ్రయించారు.18 నెలల శిక్ష అనుభవించిన తర్వాత 2021 ఆగస్టులో పెరోల్ పై బయటకు వచ్చారు. తాజాగా క్షమాబిక్ష లభించడంతో త్వరలోనే తండ్రి వారసత్వాన్ని అందుకొని యాంగ్ సామ్ సాంగ్ బాధ్యతలు పూర్తిస్థాయిలో చేపట్టబోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..