కొత్త రకం పాములపై విస్తృత అధ్యయనం.. చివరకు అదే సర్ప కాటుకు ప్రాణాలు వదిలిన పరిశోధకుడు

అరుదైన కలప గిలక్కాయ పాములు పై పరిశోధన చేసిన మార్టిన్ తన 80 ఏట.. అదే పాము కాటుతో మృతి చెందారు.. ఈ కలప గిలక్కాయ పాము జాతిని ప్రపంచానికి పరిచయం చేసింది మార్టిన్..

కొత్త రకం పాములపై విస్తృత అధ్యయనం.. చివరకు అదే సర్ప కాటుకు ప్రాణాలు వదిలిన పరిశోధకుడు
William H Marty Martin
Surya Kala

|

Aug 13, 2022 | 12:08 PM

Timber Rattlesnake: అరుదైన పాము జాతులమీద చిన్నతనం నుంచి పరిశోధన చేసి.. ఆ పాములను కాపాడడం కోసం ఎంతో కృషి చేసిన ప్రఖ్యాత పాము ఔత్సాహికులు అదే పాము కాటుతో మరణించారు. గత వారం వెస్ట్ వర్జీనియాలో పాము కాటుకు గురైన వృద్ధుడైన ప్రఖ్యాత పాము ఔత్సాహికుడు  విలియం హెచ్. “మార్టీ” మార్టిన్  మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. విలియం హెచ్. “మార్టీ” మార్టిన్ కి ప్రస్తుతం 80 ఏళ్ళు. వెస్ట్ వర్జీనియాలోని హార్పర్స్ ఫెర్రీలో తమ ఇంట్లో బందీగా ఉన్న కలప గిలక్కాయ అనే పాము కరచినట్లు.. దీంతో మార్టిన్ ఆగస్టు 3న మరణించినట్లు భార్య రెనీ మార్టిన్ తెలిపారు.

మార్టిన్ మృతితో కుటుంబ సభ్యులు సన్నిహితుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయనతో ఉన్న పరిచయాన్ని కొందరు గుర్తు చేసుకుంటున్నారు. ఉత్తర వర్జీనియాలోని బుల్ రన్ మౌంటైన్స్ ప్రిజర్వ్ మేనేజర్ జో విల్లారి .. మాట్లాడుతూ.. మార్టిన్  80 ఏళ్ల వయసులోనూ రిమోట్ ఏరియాల్లో పాము జనాభాను లెక్కించడానికి వాటిపై డాక్యుమెంటరీ తీయడం కోసం స్థానిక పర్వతాలపైకి క్రమం తప్పకుండా వెళ్లారని గుర్తు చేసుకున్నారు. ఎంతకష్టమైన ట్రెక్కింగ్ చేస్తారని చెప్పారు,

అరుదైన కలప గిలక్కాయ పాములు పై పరిశోధన చేసిన దేశంలోని ప్రముఖ నిపుణుడు మార్టిన్ మాత్రమే నని నార్త్ కరోలినాలోని స్టోక్స్‌డేల్‌కు చెందిన రాటిల్‌స్నేక్ పరిశోధకుడు జాన్ సీలీ చెప్పారు. వీటిని కనుగొనడం చాలా కష్టం.. అయితే మార్టిన్ చిన్నతనం నుంచి ఈ పాములపై ప్రత్యేక అధ్యయనం చేశారని అన్నారు. తనకు మార్టిన్ గురించి గత 30 ఏళ్లుగా తెలుసు అంటూ ఆయనతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు.

బాలుడిగా ఉన్న సమయంలోనే మార్టిన్ బుల్ రన్ పర్వతాలలో కలప గిలక్కాయల జనాభా ఉన్నట్లు కనుగొన్నాడు. అంతకు ముందు పాముల్లో ఈ జాతి పాములున్నట్లు ప్రపంచానికి సరిగ్గా తెలియదు. మార్టిన్ తన పాముల కోసం తన ఫీల్డ్ వర్క్,  రీసెర్చ్ కోసం ఎంతో కష్టపడ్డాడు. కనుగొనడం కష్టతరమైన పాము జాతిని కనుగొని డాక్యుమెంట్ చేయగల అతని సామర్థ్యం అతని సొంతం అంటూ సీలీ చెప్పారు. ఎందుకంటే కలప గిలక్కాయ పాములు చాలా రహస్య జంతువులు. ఎవరికీ కనిపించడానికి ఇష్టపడవని తెలిపారు.

ఈ పాము కాటు చాలా అరుదుగా ప్రాణాంతకంగా మారుతుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అంచనా ప్రకారం USలో సంవత్సరానికి ఐదుగురి మరణాలకు ఈ పాములు కారణమవుతున్నారు.

మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో టాక్సికాలజీ ప్రొఫెసర్ .. పాముకాటుపై నిపుణుడు డాన్ కీలర్ మాట్లాడుతూ.. కొంతమందికి మొదటిసారి పాము కరవడం కంటే.. రెండో సారి పాము కరిస్తే.. అది ప్రాణాంతకం కావచ్చని పేర్కొన్నాడు.

రాటిల్‌స్నేక్‌లు శరీరంలోని కాటు ద్వారా విషాన్ని ఇంజెక్ట్ చేసే పరిమాణానికి పెరిగితే మనిషి ప్రాణాలకు మరింత ప్రమాదకరంగా మారవచ్చునని అన్నారు. ఒక వ్యక్తి వయస్సు కూడా పాము కాటు ప్రభావం చూపిస్తుందని తెలిపాడు.

అయితే పాములపై పరిశోధన చేస్తున్న సమయంలో మార్టిన్ గతంలో కూడా ఒకసారి పాము కాటుకు గురయ్యాడు. అప్పుడు అతను కోలుకున్నాడు. కానీ రెండవ సారి మాత్రం ప్రాణాలు పోవడం దురదృష్టకరమని తెలిపారు.

కలప గిలక్కాయలు చాలా మృదువైన పాములని.. మానవుల కంటికి కనిపించడం వీటికి ఇష్టం ఉందని.. అందుకే చాలా రహస్యంగా జీవిస్తాయని.. విల్లరి చెప్పారు. ఒకవేళ ఈ పాముపై ప్రమాదవశాత్తూ కాలు పెట్టిగా కాటు వేయడం చాలా అరుదని పేర్కొన్నారు. ఈ పాములు తమ విషయాన్ని ఆహారం సంపాదన కోసం కాపాడుకుంటామని చెప్పారు. కాపర్ హెడ్ పాములు సాధారణంగా కనిపించే ఉత్తర అమెరికా పాములు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu