అంతరిక్షంలో అద్భుతం.. చిత్రమైన గెలాక్సీని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఎలా ఏర్పడిందంటే

అంతరిక్షంలో (Space) ఏముంది.. ఇది ఎన్నటికీ అంతుచిక్కని ప్రశ్న. సువిశాల అంతరిక్షంలో ఎన్నో అద్భుతాలు ఉంటాయి. వాటిని కనిపెట్టేందుకు, వాటి గుట్టు తెలుసుకునేందుకు సైంటిస్టులు నిత్యం పరిశోధనలు చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే అమెరికాలోని..

అంతరిక్షంలో అద్భుతం.. చిత్రమైన గెలాక్సీని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఎలా ఏర్పడిందంటే
Cart Wheel In Space
Follow us

|

Updated on: Aug 05, 2022 | 1:52 PM

అంతరిక్షంలో (Space) ఏముంది.. ఇది ఎన్నటికీ అంతుచిక్కని ప్రశ్న. సువిశాల అంతరిక్షంలో ఎన్నో అద్భుతాలు ఉంటాయి. వాటిని కనిపెట్టేందుకు, వాటి గుట్టు తెలుసుకునేందుకు సైంటిస్టులు నిత్యం పరిశోధనలు చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే అమెరికాలోని నాసాకు చెందిన శాస్త్రవేత్తలు కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. చక్రాన్ని ఆవిష్కరించడంతోనే మానవ నాగరికత వేగం పెరిగిందని చరిత్ర చెబుతోంది. పురాణాల నుంచి నేటి ఆధునిక యంత్రాల దాకా అన్నీ చక్రంతోనే ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు చక్రాల సహాయంతోనే సుదూరంగా ఉన్న నక్షత్రాల గుట్టు తేల్చేందుకు అత్యాధునిక జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ను పంపగలిగే దశకు మన సాంకేతికత చేరుకుంది. ఈ టెలిస్కోప్ (Telescope).. కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న గెలాక్సీలు, వాటి లోని సక్షత్రాలను మన కళ్ల ముందు ఉంచుతుంది. సుదూర అంతరిక్షంలో ఓ అతి పెద్ద ‘చక్రం’ వంటి గెలాక్సీని నాసా సైంటిస్టులు గుర్తించారు. జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌తో ఆకాశాన్ని చూస్తున్న సమయంలో ఈ చక్రాన్ని గుర్తించారు. భూమికి 50 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గెలాక్సీ కి కార్ట్ వీల్ అని పేరు పెట్టారు.

స్పైరల్ (సర్పిలాకారం) లో ఉన్న ఓ పెద్ద గెలాక్సీ, మరో చిన్న గెలాక్సీ పరస్పరం వేగంగా ప్రయాణిస్తూ ఒకదానికొకటి ఢీకొట్టడంతో కలిసిపోయాయి. ఫలితంగా ఈ వీల్ కార్ట్ గెలాక్సీ ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని మధ్యలో ఒక రింగ్, సుదూరంగా మరో రింగ్ లా నక్షత్రాలు, ఖగోళ పదార్థం చేరాయని ఆ రెండింటినీ అనుసంధానిస్తూ బండి చక్రం పుల్లల్లా ఖగోళ పదార్థాలు ఏర్పడ్డాయని వివరించారు. దీని బయటి రింగ్‌ లో కోట్ల సంఖ్యలో కొత్త నక్షత్రాలు పుడుతున్నాయని, అప్పటికే ఉన్న నక్షత్రాలు పేలిపోతూ సూపర్ నోవాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ అంతరిక్షంలో జరిగే ప్రతి చిన్న మార్పూ ఆసక్తికరమే.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీ వార్తల కోసం

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..