AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkeypox: భయపెడుతున్న మంకీపాక్స్.. అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీ.. స్వలింగ సంపర్కులకే ఎక్కువ ప్రమాదం..

మూడేళ్లుగా కరోనాతో వణుకుతున్న ప్రపంచ దేశాలకు ఇప్పుడు మంకీపాక్స్ భయం పట్టుకుంది. రోజు రోజుకు మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది

Monkeypox: భయపెడుతున్న మంకీపాక్స్.. అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీ.. స్వలింగ సంపర్కులకే ఎక్కువ ప్రమాదం..
Monkeypox Virus(File Photo)
Amarnadh Daneti
|

Updated on: Aug 05, 2022 | 1:43 PM

Share

Monkeypox Emergency: మూడేళ్లుగా కరోనాతో వణుకుతున్న ప్రపంచ దేశాలకు ఇప్పుడు మంకీపాక్స్ భయం పట్టుకుంది. రోజు రోజుకు మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈఏడాది దేశ వ్యాప్తంగా 26,200కు పైగా మంకీపాక్స్ కేసులు నమోదుకాగా..ఒక్క అమెరికాలోనే ఇప్పటివరకు సుమారు 6,600 కేసులు నమోదయ్యాయి. మంకీపాక్స్ కేసుల పెరుగుదలతో దేశ వ్యాప్తంగా అమెరికా హల్త్ ఎమర్జెనీని ప్రకటించింది. ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో దీనిని కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలను బలోపేతం చేస్తున్నామని అమెరికా వైద్యాధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో మంకీపాక్స్ కేసులు పెరిగేప్రమాదముందని గమనించిన ఆరోగ్య విభాగం హెల్త్ ఎమర్జెనీని అమల్లోకి తీసుకువచ్చింది. ఆరోగ్య అత్యవసర పరిస్ధితిని విధించడం ద్వారా మంకీపాక్స్ నియంత్రణ, నివారణ చర్యలు చేపట్టడంతో పాటు.. వైరస్ కట్టడికి అవసరమైన మందులు, టీకాలను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఏర్పడుతుంది. హెల్త్ ఎమర్జెనీ కారణంగా అత్యవసర నిధులు విడుదల చేసి.. అదనపు వైద్య సిబ్బందిని అమెరికా ప్రభుత్వం నియమించనుంది.

వాషింగ్టన్, న్యూయర్క్, జార్జియాలో అత్యధికంగా మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. ఈవైరస్ బారిన పడినవారిలో 99శాతం మంది పురుషులే ఉంటున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. స్వలింగ సంపర్కం చేసినవారిలో వైరస్ లక్షణాలు ఎక్కువుగా కనిపిస్తున్నామని ఓ వార్తా సంస్థ పేర్కొంది. మంకీపాక్స్ నియంత్రణకు ప్రపంచ దేశాలన్నీ తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. దీనిలో భాగంగా మంకీపాక్స్ వైరస్ కుటుంబానికి చెందిన మశూచి నివారణకు ఉపయోగించే టీకాలను మంకీపాక్స్ నియంత్రణకు వాడుతున్నారు. దీనిలో భాగంగా అమెరికా ఇప్పటివరకు 6లక్షల జైన్నోస్ వ్యాక్సిలను పంపిణీ చేసింది. ఇంకా పదకొండు లక్షల టీకాలు అందుబాటులో ఉన్నాయని మరో 69 లక్షల వ్యాక్సిన్ లకు ఆర్డర్ ఇచ్చినట్లు యునైటెడ్ స్టేట్స్ డిపార్టుమెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ తెలిపింది. మంకీపాక్స్ ను తీవ్రంగా పరిగణించాలని.. వైరస్ ను ఎదుర్కోవడంలో ప్రతి అమెరికన్ సహకరిచాలని అగ్రరాజ్యం కోరింది. ప్రభుత్వం ఇచ్చే టీకా తీసుకోవడంతో పాటు వైద్య, ఆరోగ్య సంస్థలు జారీచేసే నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా మంకీపాక్స్ వ్యాప్తిని నియంత్రించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. స్వలింగ సంపర్కులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీ వార్తల కోసం