Viral: ‘జూ’ ఎన్‌క్లోజర్‌లో హ్యాండ్ బ్యాగ్.. చూసి స్టన్ అవుతున్న సందర్శకులు.. అసలు రీజన్ ఇదే

జూ అంటే రకరకాల జంతువులు, పక్షలు, పాములు ఉండాలి. కానీ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంది. అది కూడా ఎన్‌క్లోజర్‌లో. అసలు విషయం ఏంటో తెలుసుకుందా పదండి.

Viral: 'జూ' ఎన్‌క్లోజర్‌లో హ్యాండ్ బ్యాగ్.. చూసి స్టన్ అవుతున్న సందర్శకులు.. అసలు రీజన్ ఇదే
Handbag
Follow us

|

Updated on: Aug 05, 2022 | 9:09 AM

Trending: మాములుగా ‘జూ’ అదే జంతు ప్రదర్శన శాలకు వెళ్లినప్పుడు అక్కడ చాలా రకాల జీవులు కనిపిస్తాయి. నడిచేవి, ఈదేవి, పాకేవి, ఎగిరేవి అన్నీ ఉంటాయ్. ఆ జీవుల్లో మనకు తెలిసినవి కొన్ని ఉంటే.. మనకి తెలియనవి కూడా కొన్ని ఉంటాయ్. ఇవన్నీ ఓకే కానీ లండన్‌(London)లో ఓ జూలో మాత్రం హ్యాండ్ బ్యాగ్‌ను కూడా అదేదో జంతువు మాదిరి ప్రదర్శనకు ఉంచారు. వాళ్లేం సరదాకు అలా పెట్టలేదండోయ్. దాని వెనుక పెద్ద రీజనే ఉంది. వన్యప్రాణుల వేట ఇప్పుడు నిత్యకృత్యమైన విషయం తెలిసిందే. ఏనుగు దంతాలు, పులి చర్మం, గోళ్లు, జింకల చర్మాల.. ఇలా మన దగ్గర అడవుల్లో సాగే జీవుల వేట చూసుంటాం. అలా మొసళ్లను వేటాడే బ్యాచ్ కూడా ఒకటి ఉంది. అది కూడా అత్యంత అరుదైన సియామీస్ మొసళ్లను(Siamese crocodile). ఈ జాతికి చెందిన మొసళ్లు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయని లెక్క తీయగా వెయ్యి లోపే అని తేలింది. ఈ మొసళ్లు పెరిగేందుకు అనువైన పరిస్థితులు లేవు. అది పక్కనబెడితే.. వాటి సంఖ్య తగ్గిపోవడానికి మరో కారణం వేట.  అవును.. ఈ మొసళ్ల చర్మంతో తయారుచేసే బ్యాగులు సహా ఇతర వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే వీటిని ఓపెన్‌గా అమ్మరు. ఎంతో ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటే కానీ ఈ బ్యాగును సొంత చేసుకోలేరు.

అలా సియామీస్ మొసలి చర్మంతో తయారు చేసిన ఓ హ్యాండ్ బ్యాగ్‌ను 2018లో లండన్ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు సీజ్ చేశారు. ఆ బ్యాగును గత కొద్ది సంత్సరాలుగా ఓ జూలో ప్రదర్శిస్తున్నారు. వన్యప్రాణుల అక్రమ వ్యాపారం ఏ స్థాయికి చేరిందో ప్రజలకు తెలియజేసేందుకు, చర్చ లేవనెత్తేందుకు అధికారులు ఇలా హ్యాండ్‌బ్యాగ్‌ను ప్రదర్శనకు ఉంచారు. తాజాగా అక్కడికి వెళ్లిన ఓ సందర్శకుడు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..