loses job offer: రూ. 33 లక్షల ఉద్యోగం పోగొట్టుకున్నాడు..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..( వీడియో)

loses job offer: రూ. 33 లక్షల ఉద్యోగం పోగొట్టుకున్నాడు..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..( వీడియో)

Anil kumar poka

|

Updated on: Aug 05, 2022 | 8:41 AM

కోడింగ్‌ కాంపిటీషన్‌లో 1,000 మందితో పోటీపడి నెగ్గిన విజేతకు అమెరికా కంపెనీ మంచి ఉద్యోగం ఆఫర్‌ చేసింది. ఏడాదికి 33 లక్షల వేతనం ఇస్తామని తెలిపింది.


కోడింగ్‌ కాంపిటీషన్‌లో 1,000 మందితో పోటీపడి నెగ్గిన విజేతకు అమెరికా కంపెనీ మంచి ఉద్యోగం ఆఫర్‌ చేసింది. ఏడాదికి 33 లక్షల వేతనం ఇస్తామని తెలిపింది. అతడి వయసు గురించి తెలిశాక ఉద్యోగం ఇవ్వలేమని సమాచారం పంపింది. విజేత వయసు కేవలం 15 ఏళ్లు కావడమే ఇందుకు కారణం. మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన వేదాంత్‌ దేవ్‌కాటే వయసు 15 సంవత్సరాలు. వేదాంత్‌ పదో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ల్యాప్‌టాప్‌ సాయంతో స్వయంగా కోడింగ్‌ నేర్చుకున్నాడు. అందులో మంచి పట్టు సంపాదించాడు. అమెరికాలోని న్యూజెర్సీ అడ్వర్‌టైజింగ్‌ కంపెనీ నిర్వహించిన కోడింగ్‌ పోటీలో పాల్గొన్నాడు. రెండు రోజుల్లో 2,066 లైన్ల కోడ్‌ రాశాడు. సునాయాసంగా విజయం సాధించాడు. వేదాంత్‌ ప్రతిభను గుర్తించిన న్యూజెర్సీ అడ్వర్‌టైజింగ్‌ కంపెనీ తమ మానవ వనరుల విభాగంలో ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చింది.

33 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీ ఇస్తామని తెలిపింది. వ్యక్తిగత వివరాలు పంపాలని కోరింది. వేదాంత్‌ ఆ వివరాలు పంపించాడు. అతడి వయసు 15 ఏళ్లేనని తెలుసుకున్న న్యూజెర్సీ కంపెనీ ఉద్యోగం ఇవ్వలేమని పేర్కొంది. తమ కంపెనీ నిబంధనల ప్రకారం చిన్న వయసు వారిని చేర్చుకోవడం సాధ్యపడదని నిస్సహాయత వ్యక్తం చేసింది. నిరాశ చెందాల్సిన అవసరం లేదని, విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తమను సంప్రదించాలని వేదాంత్‌కు సూచించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Aug 05, 2022 08:41 AM