European Union: అప్పటికల్లా పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలు బంద్.. యూరోపియన్‌ యూనియన్‌ కీలక నిర్ణయం..

యూరోప్‌ దేశాల్లో పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలు క్రమంగా కనుమరుగుకానున్నాయి. రోజు రోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం, ఇంధన కొరతను దృష్టిలో పెట్టుకొని ‘ఫిట్‌ ఫర్‌ 55’ ప్యాకేజీపై యూరోపియన్‌ యూనియన్‌ నిర్ణయానికి వచ్చింది.

European Union: అప్పటికల్లా పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలు బంద్.. యూరోపియన్‌ యూనియన్‌ కీలక నిర్ణయం..
Petrol Diesel Cars
Follow us

|

Updated on: Oct 30, 2022 | 8:54 AM

యూరోప్‌ దేశాల్లో పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలు క్రమంగా కనుమరుగుకానున్నాయి. రోజు రోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం, ఇంధన కొరతను దృష్టిలో పెట్టుకొని ‘ఫిట్‌ ఫర్‌ 55’ ప్యాకేజీపై యూరోపియన్‌ యూనియన్‌ నిర్ణయానికి వచ్చింది. ఈ దశాబ్దం చివరికి గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను 55% మేర తగ్గించడమే ఈ ప్యాకేజీ ఉద్దేశం. దీని ప్రకారం 2035 నుంచి పెట్రోల్, డీజిల్‌ కార్లు, వ్యాన్ల తయారీపై యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు నిషేధం విధించనున్నాయి. ఈ వాహనాలకు బదులుగా పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రోత్సాహమివ్వాలని ఈయూ యోచిస్తోంది. పెట్రోలు, డీజిల్‌ ఇంధనాలతో నడిచే కార్లు, వ్యాన్లు, ట్రక్కులు విడుదల చేసే ఉద్గారాలను 2030 నాటికి 55 శాతానికి తగ్గించాలని ఈయూ నిర్ణయం తీసుకుంది.. 2035 కల్లా వందశాతం లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. 2050 నాటికి వాయు ఉద్గారాలను పూర్తిగా తగ్గించాలని యూరోపియన్‌ యూనియన్‌ భావిస్తోంది.

అయితే ఈ ఒప్పందం అమల్లోకి రావాలంటే ఈయూ పార్లమెంట్, సభ్యదేశాలు ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. ప్రస్తుతం రోడ్ల మీద నడుస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలు క్రమంగా కనుమరుగు కానున్నాయి. 2035 తర్వాత పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనాలే రోడ్ల మీద తిరగాల్సి ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ తరిగిపోతున్న ఇంధన వనరులు, పెరిగిపోతున్న ధరలకు చెక్‌ పెట్టేందుకు విద్యుత్‌ వాహనాలు తప్పని సరి అని ఇప్పటికే వివిధ దేశాలు నిర్ణయానికి వచ్చాయి. ఇందుకు తగ్గట్లుగా వాటి ఉత్పత్తి కూడా భారీగా పెరగాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..