Viral News: కడుపు నొప్పితో హాస్పిటల్ వెళ్లిన యువకుడు.. స్కానింగ్ చేసి చూడగా ఉలిక్కిపడ్డ వైద్యులు.
నేపాల్‌లో దారుణ సంఘటన జరిగింది. 26 ఏళ్ల యువకుడి కడుపులో వైద్యులు మద్యం సీసాను గుర్తించారు. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వైద్యులతో పాటు స్థానికంగా ఉన్న వారికి ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇంతకీ ఆ యువకుడి కడుపులోకి మద్యం..
నేపాల్‌లో దారుణ సంఘటన జరిగింది. 26 ఏళ్ల యువకుడి కడుపులో వైద్యులు మద్యం సీసాను గుర్తించారు. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వైద్యులతో పాటు స్థానికంగా ఉన్న వారికి ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇంతకీ ఆ యువకుడి కడుపులోకి మద్యం సీసా ఎలా వెళ్లింది.? అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
వివరాల్లోకి వెళితే.. నేపాల్‌లోని రౌతహత్ జిల్లాలోని గుజరా మున్సిపాలిటీకి చెందిన నూర్సాద్ మన్సూరి ఇటీవల తీవ్రమైన నడుపు నొప్పి కారణంగా వైద్యులను సంప్రదించాడు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతడి కడుపులో వోడ్కా బాటిల్‌ను గుర్తించింది. ఐదు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన యువకుడి నుంచి శస్త్రచికిత్స చేసి బాటిల్‌ను తొలగించారు. ఇందుకోసం వైద్యులు రెండు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది.
బాటిల్ యువకుడి అతని పేగును చీల్చింది, దీని వల్ల మలం లీకేజ్ కావడంతో పాటు పేగులకు వాపు వచ్చింది. కానీ ప్రస్తుతం ఆ కుర్రాడి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇది నూర్సాద్ స్నేహితుల పనేనని పోలీసుల విచారణలో తేలింది. బాగా మద్యం సేవించిన అనంతరం యువకుడి ప్రైవేట్ పార్ట్ నుంచి బాటిల్‌ను శరీరంలో జొప్పించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి రౌతహత్ పోలీసులు షేక్ సమీమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..