AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి కాశ్మీర్‌పై అక్కసు వెళ్లగక్కిన పాక్.. సమావేశం ఏదైనా ప్రస్తావిస్తామన్న బిలావల్ భుట్టో జర్ధానీ

Bilawal Bhutto Zardari: పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్ధానీ జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ తీరుపై మండిపడ్డారు. తాను కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించడానికి చాలా కష్టపడాల్సి వస్తుందన్నారు.

మరోసారి కాశ్మీర్‌పై అక్కసు వెళ్లగక్కిన పాక్.. సమావేశం ఏదైనా ప్రస్తావిస్తామన్న బిలావల్ భుట్టో జర్ధానీ
Bilawal Bhutto Zardari
Balaraju Goud
|

Updated on: Mar 11, 2023 | 3:51 PM

Share

జమ్మూ కాశ్మీర్ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది పాకిస్తాన్. ఇప్పటికే పలు వేదికలపై ప్రస్తావిస్తోంది. ఐక్యరాజ్యసమితి సాధారణ, భద్రత మండలిలో ఇదే అంశాన్ని వక్కానిస్తున్నారు పాక్ ప్రతినిధులు. తాజాగా పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్ధానీ జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ తీరుపై మండిపడ్డారు. తాను కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అంగీకరించారు. ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్‌ను ప్రధాన అజెండాలోకి తీసుకురావడంలో ప్రత్యేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.

ఐక్యరాజ్యసమితిలోని ప్రతి ఫోరమ్‌లో పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ సమస్యను లేవనెత్తుతుందన్నారు. ఏదైనా ఇతర అంశంపై చర్చిస్తున్నా.. చర్చించకున్నా.. ఇస్లామిక్ దేశం పోరాడుతూనే ఉందన్నారు. పాకిస్తాన్ మాత్రం జమ్మూ కాశ్మీర్ సమస్యపై ఐక్యరాజ్యసమితి నుండి మద్దతు పొందలేకపోయింది. ఇది ఎల్లప్పుడూ కాశ్మీర్‌ను భారతదేశం – పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సమస్యగా పరిగణించింది.

శుక్రవారం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. ముందుగా భారత్ ను తమ మిత్రదేశం అని, ఆ తరువాత పొరుగు దేశం అంటూ తడబడ్డారు. కాశ్మీర్, పాలస్తీనా మధ్య సంబంధం ఉందని, రెండు కూడా ఇకే విధమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు జర్ధానీ. కాశ్మీర్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా మన పొరుగుదేశం భారత్ దీనిపై తీవ్ర అభ్యంతరం చెబుతోందని, కల్లబొల్లి మాటలు చెబుతోందని విరుచుకుపడ్డారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశమైనా లేక మరేదైనా ప్రతి సందర్భంలోనూ పాలస్తీనా, కాశ్మీర్ ప్రజల కష్టాలను ముందుకు తెస్తామని ఆయన అన్నారు. కశ్మీర్ ప్రజల కష్టాలకు, పాలస్తీనా ప్రజల కష్టాలకు చాలా పోలికలు ఉన్నాయని జర్దారీ అన్నారు. ఐక్యరాజ్యసమితి ముందు రెండు సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. పాలస్తీనాపై మాత్రమే కాకుండా కాశ్మీర్‌పై కూడా పాకిస్థాన్ అదనపు శ్రద్ధ వహించాలనుకుంటోందని బిలావల్ భుట్టో జర్ధానీ స్పష్టం చేశారు.

ఇది వివాదాస్పద ప్రాంతం కాదని భారత్ మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది. దీనిని అంతర్జాతీయ సమాజం గుర్తించాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు, ఆగస్టు 2019లో, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడానికి భారతదేశం రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ను తొలగించింది. అప్పటి నుంచి భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
విడాకులు తీసుకున్నా ఆగని వేధింపులు..
విడాకులు తీసుకున్నా ఆగని వేధింపులు..
జీవిత భాగస్వామికిచ్చే హెచ్‌4 వీసాలు ఇక ఉండవా?రద్దు దిశగా అడుగులు!
జీవిత భాగస్వామికిచ్చే హెచ్‌4 వీసాలు ఇక ఉండవా?రద్దు దిశగా అడుగులు!
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?