తవ్వకాల్లో 1000 ఏళ్లనాటి మధ్యయుగపు బంగారు నిధి.. రెండేళ్ల తర్వాత బయటపడ్డ సీక్రెట్

Medieval Gold Treasure: 13వ శతాబ్దం మధ్యలో డచ్ భూభాగాలైన వెస్ట్ ఫ్రైస్‌ల్యాండ్, హాలండ్ మధ్య యుద్ధం జరిగింది. ఇందులో హూగ్‌వుడ్ ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉందని చరిత్రకారులు చెబుతున్నారు.

తవ్వకాల్లో 1000 ఏళ్లనాటి  మధ్యయుగపు బంగారు నిధి.. రెండేళ్ల తర్వాత బయటపడ్డ సీక్రెట్
Medieval Gold Treasure
Follow us

|

Updated on: Mar 11, 2023 | 3:24 PM

నెదర్లాండ్స్‌లో 1000 ఏళ్ల మధ్యయుగపు బంగారు నిధిని డచ్ చరిత్రకారుడు కనుగొన్నాడు. నిధిలో నాలుగు బంగారు చెవి లాకెట్టులు, రెండు బంగారు ఆకులు, 39 వెండి నాణేలు ఉన్నట్లు గుర్తించారు. డచ్ నేషనల్ మ్యూజియం ఆఫ్ యాంటిక్విటీస్ ఈ సమాచారాన్ని అందించింది. మ్యూజియం డైరెక్టర్ చెప్పిన దాని ప్రకారం, దేశంలో ఈ చారిత్రక ఆవిష్కరణ సమయంలో లభించిన బంగారు ఆభరణాలు చాలా అరుదైనవిగా పేర్కొన్నారు. అయితే, ఈ నిధిని ఎందుకు, ఎవరు పూడ్చిపెట్టారనేది ప్రస్తుతానికి మిస్టరీగా మిగిలిపోయింది.

రాయిటర్స్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, 27 ఏళ్ల లోరెంజో రుయిటర్ 10 సంవత్సరాల వయస్సు నుండి నిధి కోసం వెతుకుతున్నాడు. 2021 సంవత్సరంలో అతను నెదర్లాండ్స్‌లోని హూగ్‌వుడ్ అనే చిన్న పట్టణంలో మెటల్ డిటెక్టర్‌ని ఉపయోగించి బంగారు నిధిని కనుగొన్నాడు. ఇంతటి విలువైన వస్తువును కనుగొనడం నాకు చాలా ప్రత్యేకమైన విషయం. ఇంత పాత కాలపు నిధి దొరుకుతుందని ఊహించలేదన్నా లోరెంజో.. ఈ విషయాన్ని రెండేళ్లపాటు దాచడం చాలా కష్టమైందన్నారు. నేషనల్ మ్యూజియం బృందానికి ఈ పురాతన వస్తువులను అప్పగించినట్లు వెల్లడించారు. నిధిలో ఉన్న వాటి శుభ్రత, చరిత్ర తెలుసుకోవడానికి కొంత సమయం కావాలి.. కాబట్టి మౌనంగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. దాదాపు 1250 సంవత్సరంలో ఈ నిధి దాచి ఉంచి ఉండవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో నెదర్లాండ్స్‌లో మధ్యయుగపు బంగారు ఆభరణాలు లభించడం చాలా అరుదు.

13వ శతాబ్దం మధ్యలో డచ్ భూభాగాలైన వెస్ట్ ఫ్రైస్‌ల్యాండ్, హాలండ్ మధ్య యుద్ధం జరిగింది. ఇందులో హూగ్‌వుడ్ ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఎవరో ప్రభావవంతమైన వ్యక్తి తన విలువైన వస్తువులను భద్రంగా ఉంచడానికి ఈ నిధిని దాచిపెట్టి ఉంటాడని భావిస్తున్నారు. అయితే వీటి ఖచ్చితమైన నిర్ధారణ కోసం రెండేళ్ల పాటు అధ్యయనం చేయాల్సి వచ్చిందని మ్యూజియం డైరెక్టర్ చెప్పారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..