చైనాలో విజృంభిస్తున్న డేంజరస్ ప్లూ.. మళ్లీ కరోనా తరహా ఆంక్షలు, లాక్‌డౌన్‌కు సన్నాహాలు!
China Lockdown: చైనాలో మరోసారి కల్లోలం మొదలైంది. కొన్ని నగరాల్లో లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధమవుతోంది.
చైనాలో మరోసారి కల్లోలం మొదలైంది. కొన్ని నగరాల్లో లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధమవుతోంది. చైనాలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఫ్లూ కేసులు మాత్రం వేగంగా పెరుగుతున్నాయి. ఈ కారణంగా, చైనా అధికారులు కొన్ని నగరాల్లో లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించారు. దీంతో ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలా చేయడం వల్ల కోవిడ్ కాలంలో పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చైనాలో గత కొన్ని రోజులుగా కొత్త వైరస్ విస్తరిస్తున్నట్లు గుర్తించారు. ఇవి ఎక్కువ ట్రాన్స్‌మిసిబిలిటీతో అత్యంత వేగంగా వ్యాపించే అంటు వ్యాధిగా వైద్యులు చెబుతున్నారు. దీంతో గత కొద్దిరోజుల నుంచి చైనాలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో లాక్‌డౌన్ విధించడంతో పాటు ప్రయాణాల విషయంలో కొన్ని పరిమితులు అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
చైనా నగరమైన జియాన్‌లో లాక్‌డౌన్‌కు సంబంధించి అత్యవసర ప్రతిస్థితులను సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలో వైరస్ సోకిన ప్రాంతాలను మూసివేయాలని పేర్కొంది. ట్రాఫిక్‌ను తగ్గించేందుకు ఆదేశాలు కూడా జారీ చేయనున్నారు. ఉత్పత్తి, వ్యాపార కార్యకలాపాలు కూడా నిలిపివేయాలని సూచించారు. షాపింగ్ మాల్స్, థియేటర్లు, లైబ్రరీలు, పర్యాటక ప్రదేశాలు, ఇతర రద్దీ ప్రదేశాలు కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్ ప్రకారం, పాఠశాలలు, నర్సరీలు అన్ని స్థాయిలలో మూసివేయాలని అధికారులు ఆదేశించార. జియాన్‌లో దాదాపు 13 మిలియన్ల జనాభా ఉంది. ఈ నగరం ప్రసిద్ధ పర్యాటక కేంద్రం కూడా. లాక్‌డౌన్ వార్తలకు సంబంధించి ప్రజలు సోషల్ మీడియాలో నగర పాలక సంస్థపై విమర్శలు చేస్తున్నారు. లాక్‌డౌన్ విధించే బదులు ప్రజలకు టీకాలు వేయండి అంటూ కోరుతున్నారు. ఇదిలావుంటే జాతీయ స్థాయిలో స్పష్టమైన ఆదేశాలు లేకుండా.. వ్యాపార వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేయాలని జియాన్ ఒక తీర్మానాన్ని జారీ చేయాలని యోచిస్తోంది. అటు చైనాలో ఫ్లూ కేసుల పెరుగుదలతో పాటు, కొన్ని ఫార్మసీలలో మందుల కొరత కూడా ఉంది.
విశేషమేమిటంటే, కోవిడ్ మహమ్మారి సమయంలో, చైనా ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన కోవిడ్ పరిమితులను అమలు చేసింది. ఇందులో కొన్ని నగరాల్లో నెలల తరబడి లాక్‌డౌన్‌ను కూడా చేర్చారు. జియాన్ నగరం కూడా డిసెంబర్ 2021 నుంచి జనవరి 2022 మధ్య కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేశారు. ఈ సమయంలో చాలా మందికి ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడింది. అలాగే వైద్యసేవలు కూడా దెబ్బతిన్నాయి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..