Sudan: సూడాన్‌లో ఇంకా చల్లారని ఘర్షణలు.. 400 దాటిన మృతుల సంఖ్య
సూడాన్‌లో సైన్యానికి, పారమిలటరీ రాపిడ్ సపోర్డ్ బలగాల మధ్య ఘర్షణలు ఇంకా చల్లారడం లేదు. రోజురోజుకు పోరుతో దేశంలో రక్తపాతం పెరుగుతోంది. ఖార్తూమ్ సహా పలు నగరాల్లో భారీగా కాల్పులు కొనసాగుతున్నాయి. అయితే వారం రోజులుగా కొనసాగుతున్న ఆ దాడుల్లో ఇప్పటివరకు 413 మంది మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మరో 3500 మందికి పైగా గాయలపాలైనట్లు తెలిపింది.

సూడాన్‌లో సైన్యానికి, పారమిలటరీ రాపిడ్ సపోర్డ్ బలగాల మధ్య ఘర్షణలు ఇంకా చల్లారడం లేదు. రోజురోజుకు పోరుతో దేశంలో రక్తపాతం పెరుగుతోంది. ఖార్తూమ్ సహా పలు నగరాల్లో భారీగా కాల్పులు కొనసాగుతున్నాయి. అయితే వారం రోజులుగా కొనసాగుతున్న ఆ దాడుల్లో ఇప్పటివరకు 413 మంది మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మరో 3500 మందికి పైగా గాయలపాలైనట్లు తెలిపింది. అయితే ఈ రెండు బలగాల మధ్య జరుగుతున్న ఘర్షణలను చల్లార్చి సమస్య పరిష్కరించుకునేందుకు తాత్కలిక కాల్పుల విరమణ చేసేలా ఇరుపక్షాల మధ్య మధ్య అంగీకారం కుదిరింది. కానీ అది ఫలించలేదు. శుక్రవారం ఈద్ ప్రార్థనల సమయంలోనూ సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య కాల్పులు జరిగాయి.
అయితే ఈ ఘర్షణల వల్ల వందలాది మంది చనిపోతుండటంతో సూడన్ లోని తమ దేశ పౌరులను స్వదేశాలకు తీసుకెళ్లేందుకు వివిధ దేశాలు సిద్ధమయ్యాయి. అయితే ఈ కాల్పుల విరమణ అమలు కాకపోగా విమానశ్రయాల్లో కూడ యుద్ధ వాతావరణం నెలకొనడంతో పౌరులు తరలించడం కష్టంగా మారింది. మరోవైపు పారామిలిటరీ దళంతో చర్చలు జరిపేందుకు సూడాన్ సైన్యం సిద్ధంగా లేకపోవడం పరిస్థితులు రోజురోజుకు దిగజారిపతున్నాయి. అయితే పారామిలిటరీ దళం.. తమకు లొంగిపోవడం ఒక్కటే ఆమోదయోగ్యమంటూ స్పష్టం చేసింది. రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ దళాన్ని సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదన వల్లే.. ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఇరు వర్గాల బలగాల మధ్య కాల్పులు కొనసాగుతుండటంతో సూడాన్‌లో భీకర వాతావరణం నెలకొంది.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
