AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఈ వీడియో చూస్తే జపాన్ ప్రజలు ఎలాంటి వారో అర్థమవుతుంది..

జపాన్ దేశం అభివృద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న దేశమైనప్పటికీ కొత్త కొత్త ఆవిష్కరణలతో సాంకేతిక రంగంలో రోజురోజుకి దూసుకెళ్తుంది. రెండు సార్లు ఆ దేశంపై అణుబాంబులు పడ్డప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా ముందడుగులు వేసింది. జపాన్ లోని టెక్నాలజీని చూసి ఇప్పటికీ ప్రపంచ దేశాలు ఆశ్చర్యపడుపోతుంటాయి.

Watch Video: ఈ వీడియో చూస్తే జపాన్ ప్రజలు ఎలాంటి వారో అర్థమవుతుంది..
Japan Passenger
Aravind B
|

Updated on: Apr 22, 2023 | 8:00 AM

Share

జపాన్ దేశం అభివృద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న దేశమైనప్పటికీ కొత్త కొత్త ఆవిష్కరణలతో సాంకేతిక రంగంలో రోజురోజుకి దూసుకెళ్తుంది. రెండు సార్లు ఆ దేశంపై అణుబాంబులు పడ్డప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా ముందడుగులు వేసింది. జపాన్ లోని టెక్నాలజీని చూసి ఇప్పటికీ ప్రపంచ దేశాలు ఆశ్చర్యపడుపోతుంటాయి. అయితే జపాన్ సాంకేతిక రంగంలోనే కాదు అక్కడి ప్రజలు కూడా ఎంతోమంది మానవతాదృక్పథంతో, ఇతరులకు సహాయం చేసాలా ఉంటారు. వాళ్ల మనస్థత్వం ఏంటో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఓ వ్యక్తి తన లగేజ్ తో నడుచుకుంటూ వెళ్తాడు. అలా వెళ్తుండగానే ఒక్కసారిగా అతని కాలు అదుపుతప్పడంతో పడిపోతాడు.

అలాగే అతని చేతిలో ఉన్న కరెన్సీ నోట్లు కూడా చెల్లాచెదురుగా పడిపోతాయి. అక్కడ నుంచి వెళ్తున్న ఇతర ప్రయాణికులు ఆ డబ్బులన్నీ సేకరించి అతనికి ఇస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జపాన్ ప్రజల మనస్థత్వంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి. జపాన్ ప్రజలు ఎలా ఉంటారో మీరు కూడా అర్థం చేసుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..