Corona: ఒక్క ఔషధంతో కరోనా ఖతం!! కేవలం 5 రోజుల్లోనే.! పరిశోధనలో వెల్లడైన ఆసక్తికర విషయాలు..

Covid Treatment: కరోనా వైరస్‌ను నివారించేందుకు జరుగుతున్న పరిశోధనల్లో మరో ముందడుగు పడినట్లు తెలుస్తోంది...

Corona: ఒక్క ఔషధంతో కరోనా ఖతం!! కేవలం 5 రోజుల్లోనే.! పరిశోధనలో వెల్లడైన ఆసక్తికర విషయాలు..
Corona Vaccine
Follow us
Ravi Kiran

|

Updated on: May 20, 2021 | 6:08 PM

Covid Treatment: కరోనా వైరస్‌ను నివారించేందుకు జరుగుతున్న పరిశోధనల్లో మరో ముందడుగు పడినట్లు తెలుస్తోంది. కేవలం ఒకే ఒక్క ఔషధంతో కరోనాకు చెక్‌ పెట్టే దిశగా ఆస్ట్రేలియా-అమెరికా శాస్త్రవేత్తల బృందం జరిపిన పరిశోధనల్లో సానుకూల ఫలితాలు వచ్చాయట. గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన మెంజీస్ హెల్త్ ఇనిస్టిట్యూట్ నేతృత్వంలో అభివృద్ధి చేసిన ఔషధాన్ని ఎలుకలపై ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చినట్టు పరిశోధకులు తెలిపారు.

శరీరంలోకి ప్రవేశించిన వైరస్ తన సంతతిని వృద్ధి చేసుకోకుండా ఈ ఔషధం నిలువరిస్తున్నట్టు పరిశోధనల్లో తేలింది. ఎలుకల్లో వైరస్ కణాలు 99.9 శాతం మేర క్షీణించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలుకల్లో వచ్చిన ఫలితాలే మనుషుల్లోనూ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కరోనా బాధితులకు ఐదు రోజులపాటు ప్రతి రోజూ దీనిని ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం ద్వారా కరోనాను అడ్డుకోవచ్చునని వారు చెప్పారు. అయితే, మనుషులపై క్లినికల్ ట్రయిల్స్ పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఔషధం వైరస్‌ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకోవడంతో పాటు అన్ని రకాల స్ట్రెయిన్ల నుంచి విముక్తి పొందడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.

ఇవి చదవండి:

పెళ్లి పీటలపై నుంచి వరుడు ప‌రార్‌.. వ‌ధువు చేసిన పనికి అంతా షాక్.! కథలో ఊహించని ట్విస్ట్..

భూమిలో కూరుకుపోయిన చిన్నారి.. కళ్లను మోసం చేస్తున్న చిత్రం.. రహస్యం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!

 ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా..? అయితే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి.!