Viral Video : కిడ్నాపర్‌తో పోరాడిన పదకొండేళ్ల బాలిక.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Viral Video : పాఠశాల బస్సుకోసం ఎదురు చూస్తున్న పదొకొండేళ్ల బాలికను గుర్తు తెలియని దుండగుడు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు.

Viral Video : కిడ్నాపర్‌తో పోరాడిన పదకొండేళ్ల బాలిక.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
Kidnapper
Follow us
uppula Raju

|

Updated on: May 20, 2021 | 4:38 PM

Viral Video : పాఠశాల బస్సుకోసం ఎదురు చూస్తున్న పదొకొండేళ్ల బాలికను గుర్తు తెలియని దుండగుడు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ బాలిక అతడితో పోరాడి తప్పించుకున్న తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. ఉదయం 7 గంటలకు ఫ్లోరిడాలోని వెస్ట్ పెన్సకోలాలో జరిగిన ఈ భయానక సంఘటన అక్కడ ఉన్న నిఘా కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎస్కాంబియా కౌంటీ షెరీఫ్ చిప్ సిమన్స్ ధైర్య పోరాటం చేసినందుకు ఆ అమ్మాయిని ప్రశంసించారు. ఒక్కసారిగా దుండగుడు వచ్చి పట్టుకునేసరికి ఆమె చాలా భయపడింది కానీ పోరాడింది. అతడిని కాలుతో తన్నడం ప్రారంభించింది. చేతులతో నెట్టివేసింది. పిడికిలి బిగించి కొట్టింది. ఆమె ధైర్యం అద్భుతం అని ప్రశంసించారు. ఆ అమ్మాయి ప్రతిఘటించడంతో దుండగుడు కారు వద్దకు పరిగెత్తి వెళ్లిపోయాడు. ఈ కేసుకు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు షెరీఫ్ తెలిపారు. నిందితుడు కత్తితో వచ్చాడని, తెలుపు డాడ్జ్ పికప్ ట్రక్కును నడుపుతున్నట్లు ధ్రువీకరించారు.

నిఘా ఫుటేజ్‌లో కారు స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు నిందితుడిని గుర్తించగలిగారు. తరువాత ఈ వ్యక్తిని 30 ఏళ్ల జారెడ్ పాల్గా గా గుర్తించారు. అతను చాలా నేర ప్రవృత్తి గలవాడు. సరిగ్గా ఈ సంఘటనకు కొన్ని వారాల ముందు బాలిక అదే వ్యక్తిని ఎదుర్కొంది. కానీ ఆ సమయంలో అతను ఆమెతో స్పానిష్ భాషలో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఆ రోజు నుంచి అమ్మాయి తన తల్లితో కలిసి బస్ స్టాప్‌కి వెళుతోంది. కానీ అపహరణకు ప్రయత్నించిన రోజు ఆమె ఒంటరిగా ఉంది.

Royal Enfield: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ కొన్నవారికి అలర్ట్‌.. బైకులను వెనక్కి తీసుకుంటున్న కంపెనీ.. ఎందుకంటే!

Senior Citizens FD Scheme: సీనియ‌ర్ సిటిజ‌న్స్‌‌కు స్పెష‌ల్ ఎఫ్‌డీ స్కీమ్‌లు.. ఆకర్శనీయమైన వ‌డ్డీ రేట్లు.. ఏ బ్యాంకు ఎంత చెల్లిస్తోందో తెలుసా…!

సీఏ జాబ్ వదిలి తేనె బిజినెస్..! వివిధ రుచుల హనీ అమ్ముతూ లక్షలు గడించాడు.. ఎలాగో తెలుసుకోండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?