Senior Citizens FD Scheme: సీనియర్ సిటిజన్స్‌కు స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌లు.. ఆకర్శనీయమైన వడ్డీ రేట్లు.. ఏ బ్యాంకు ఎంత చెల్లిస్తోందో తెలుసా…!
Fixed Deposit Scheme: సాధారణంగా ఈ ఫిక్సడ్ డిపాజిట్లో ఇతరులకు ఆఫర్ చేసే వడ్డీ రేట్ల కంటే 50 బేసిస్ పాయింట్లు అదనంగా సీనియర్ సిటిజన్లకు ఇస్తుంటాయి. అయితే స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌లు అంతకంటే ఎక్కవ వడ్డీనే అందిస్తాయి.
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వేగంగా పడిపోతున్న వడ్డీ రేట్ల నుంచి సీనియర్ సిటిజన్లను రక్షించేందుకు అన్ని బ్యాంకులు ప్రత్యేకమైన స్కీములను తీసుకొస్తున్నాయి. సీయర్ సిటిజన్ల కోసం ప్రవేశపెట్టిన పథకమే సీనియర్ సిటిజన్ స్పెషల్ డిపాజిట్ స్కీమ్. ఈ స్కీమ్ గడువు తేది మార్చి 30తో ముగియగా.., జూన్ 30,2021 వరకు పొడిగిస్తూ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. అంటే మరో 40 రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఈ ఫిక్సడ్ డిపాజిట్లో ఇతరులకు ఆఫర్ చేసే వడ్డీ రేట్ల కంటే 50 బేసిస్ పాయింట్లు అదనంగా సీనియర్ సిటిజన్లకు ఇస్తుంటాయి. అయితే స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌లు అంతకంటే ఎక్కవ వడ్డీనే అందిస్తాయి. కొత్తగా చేసే డిపాజిట్లతో పాటు, రెన్యూవల్ డిపాజిట్లకు ఇవి వర్తిస్తాయి. ఇలాంటి పథకాన్ని ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నాయి. అయితే వారు అందించే స్పెషల్ డిపాజిట్ స్కీమ్‌లు వాటి వివరాలను ఓ సారి చూద్దాం…
ఎస్‌బీఐ ‘వుయ్‌కేర్ డిపాజిట్’.. (SBI ‘Wecare Deposit’)
గత సంవత్సరం మే నెలలో SBI ‘Wecare Deposit’ డిపాజిట్‌ను ఎస్‌బీఐ (SBI ) మొదలు పెట్టింది. దీని ద్వారా ఫిక్సడ్ డిపాజిట్లపై ఇతరులకు ఇచ్చే వడ్డీ రేటు కంటే సీనియర్ సిటిజన్లకు 80 బేసిస్ పాయింట్ల( BPS) మేర అదనపు వడ్డీని అందిస్తుంది. ఈ స్పెషల్ డిపాజిట్ స్కీమ్ కింద డిపాజిట్లు చేసిన పెద్దలకు 6.20 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్..(ICICI Bank Golden Years)
ఫిక్సడ్ డిపాజిట్లపై ఇతరులకు ఇచ్చే వడ్డీ రేటు కంటే సీనియర్ సిటిజన్లకు 80 బేసిస్ పాయింట్ల( BPS) మేర అదనపు వడ్డీని ఆఫర్ చేస్తోంది. ICICI Bank సీనియర్ సిజిజన్ కేర్ ఎఫ్‌డీపై వార్షికంగా 6.30% వడ్డీ అందిస్తోంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్ కేర్..(HDFC Bank Senior Citizen Care)
సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే 75 బేసిస్ పాయింట్లు ( BPS) అదనపు వడ్డీరేటును హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank ) సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ(FD)లకు ఇస్తోంది. ఈ స్పెషల్ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీ రేటును బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు అందిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా..(Bank of Baroda)
ఈ పథకం కింద సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్లకి ఇచ్చే వడ్డీ రేట్లతో పోలిస్తే.. సీనియర్ సిటిజన్లకు 100 బేసిస్ పాయింట్లు ( BPS) అదనపు వడ్డీ రేటు లభిస్తుంది. ఈ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో 5 సంవత్సరాలకు పైబడి, 10 సంవత్సరాలలోపు డిపాజిట్ చేసే సీనియర్ సిటిజన్లకు 6.25శాతం వడ్డీని బ్యాంక్ అందిస్తుంది.