సీఏ జాబ్ వదిలి తేనె బిజినెస్..! వివిధ రుచుల హనీ అమ్ముతూ లక్షలు గడించాడు.. ఎలాగో తెలుసుకోండి..
Honey Farming : అహ్మదాబాద్‌కు చెందిన ప్రతిక్ ధోడా తన కలను నెరవేర్చుకోవడం కోసం ప్రజలకు ఉపయోగపడే పని చేయడంపై దృష్టి
Honey Farming : అహ్మదాబాద్‌కు చెందిన ప్రతిక్ ధోడా తన కలను నెరవేర్చుకోవడం కోసం ప్రజలకు ఉపయోగపడే పని చేయడంపై దృష్టి సారించాడు. అతను తేనెటీగల పెంపకం, స్వచ్ఛమైన తేనె తయారీ చేయాలనుకున్నాడు. మార్కెట్లో కల్తీ తేనె ఉండటం వల్ల మానవ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. తేనె అనేది ఆరోగ్యాన్ని కాపాడే ఒక టానిక్ వంటిది. ఔషధ లక్షణాలను కలిగి ఉన్న ఒక మూలకం.
2019 డిసెంబర్‌లో తేనె ఉత్పత్తి ప్రారంభించడానికి ప్రతీక్ రూ .15 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఒకే సంవత్సరంలో స్టార్టప్ నాలుగు టన్నుల తేనెను ఉత్పత్తి చేసింది. దీంతో పెట్టిన పెట్టుబడి రూ.15 లక్షలు తిరిగి సంపాదించాడు. 2021 లో తేనె పెంపకం ద్వారా రూ.50 లక్షలు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రతి బ్యాచ్ పక్షం రోజులకు రూ.6 లక్షల విలువైన తేనెను ఉత్పత్తి చేస్తుంది.
2019 ప్రారంభంలో అతను తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి, దాని సహాయక వ్యాపార అవకాశాలపై పరిశోధన ప్రారంభించాడు. తేనెటీగల పెంపకం పద్ధతులు, వాటి వాణిజ్య నమూనాలను అర్థం చేసుకోవడానికి ఈ రంగంలో పనిచేస్తున్న రైతులను కలిసాడు. తేనె టీగలను పెంచడానికి అతడికి స్థలం లేదా పొలం లేదు. అందువల్ల రైతులకు కమిషన్ చెల్లించి పంట పొలాలను వాడుకునేవాడు.
ప్రతీక్‌కు మొదటి త్రైమాసికంలో ఒక టన్ను తేనె వచ్చింది. కరోనా సంభవించినప్పుడు రిటైల్ దుకాణాల ద్వారా వినియోగదారులను చేరే సంప్రదాయ మార్గాన్ని వీరు అనుసరించలేదు. ప్రత్యామ్నాయంగా అతను వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తేనెను ప్రోత్సహించడం, విక్రయించడం ప్రారంభించాడు. ప్రస్తుతం అల్లం, నిమ్మ, తులసి, అజ్మో, డ్రమ్ స్టిక్, యూకలిప్టస్, మల్టీఫ్లోరా, లీచీ, కుంకుమ, సోంపుతో సహా 11 రుచుల తేనెను విక్రయిస్తున్నాడు. తేనె ధర కిలోకు రూ.600 నుంచి రూ .900 వరకు ఉంటుంది.