Gautam Adani: బ్లూమ్‌బెర్గ్‌ జాబితా.. ఆసియాలోనే రెండో కుబేరుడు పారిశ్రామిక వేత్త గౌతమ్‌ ఆదానీ..

Gautam Adani: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అత్యధికంగా సంపదను పెంచుకున్న పారిశ్రామిక దిగ్గజాల్లో భారత్‌కు చెందిన గౌతమ్‌ అదానీ అగ్రగణ్యుడిగా నిలిచారు. ఆసియాలోనే రెండో

Gautam Adani: బ్లూమ్‌బెర్గ్‌ జాబితా.. ఆసియాలోనే రెండో కుబేరుడు పారిశ్రామిక వేత్త  గౌతమ్‌ ఆదానీ..
Gautam Adani
Follow us

|

Updated on: May 20, 2021 | 10:49 PM

Gautam Adani: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అత్యధికంగా సంపదను పెంచుకున్న పారిశ్రామిక దిగ్గజాల్లో భారత్‌కు చెందిన గౌతమ్‌ అదానీ అగ్రగణ్యుడిగా నిలిచారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద కుబేరుడిగా ఆదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ ఆదానీ నిలిచారు. ఇప్పటి వరకు రెండో స్థానంలో ఉన్న చైనా బిలియ నీర్‌ జోంగ్‌ షాన్హాన్‌ స్థానాన్ని ఆదానీ సంపాదించుకున్నారు. దీంతో తొలి ఇద్దరు ఆసియా కుబేరులుగా భారతీయులు అవతరించారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ ప్రకారం.. గౌతమ్‌ ఆదానీ నికర సంపద తాజాగా 66.5 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. షాన్హాన్‌ నికర సంపద 63.6 బిలియన్ల డాలర్లు మాత్రమే. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో చైనా బిలియనీర్‌ను దాటేసిన రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ఆసియాలోకెల్లా అతిపెద్ద కుబేరుడిగా అవతరించారు. తాజాగా ముఖేష్‌ అంబానీ తర్వాత స్థానాన్ని గౌతం అంబానీ భర్తీ చేశారు. ఏడాదిలో ఆదానీ గ్రూప్‌ కంపెనీలు, ఆదానీ గ్రీన్‌, ఆదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఆదానీ గ్యాస్‌, ఆదానీ ట్రాన్స్‌మిషన్‌ సంస్థల షేర్లు భారీగా ర్యాలీ అయ్యాయి. దీంతో గౌతం ఆదానీ సంపదపైపైకి దూసుకెళ్లింది. ఆదానీ టోటల్‌ గ్యాస్‌ షేర్‌ ఏడాదిలో 1145 శాతం, ఆదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 827 శాతం, ఆదానీ ట్రాన్స్‌మిషన్‌ 617 శాతం గ్రోత్‌ నమోదు చేశాయి. ఆదానీ గ్రీన్‌ ఎనర్జీ 433, ఆదానీ పవర్‌ 189 శాతం పెరిగాయి.

అదానీ గ్రూప్ విమానాశ్రయ నిర్వహణ వ్యాపారంలో తీవ్రంగా ముందుకు సాగింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జివికే గ్రూప్ నుంచి గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ సంస్థ స్వాధీనం చేసుకుంది. ఇది రాబోయే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో నియంత్రణ వాటాను కూడా సొంతం చేసుకుంది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని సంస్థ అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, జైపూర్, తిరువనంతపురం, మరియు గౌహతి విమానాశ్రయాల కోసం విమానాశ్రయాల అథారిటీ ఆఫ్ ఇండియా నుండి 50 సంవత్సరాల నిర్వహణ హక్కులను సాధించుకుంది.

ఇవీ చదవండి

SBI Customer Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌.. 3 రోజులు ఆ సర్వీసులన్నీ బంద్.. ఎందుకో తెలుసా..?

Indian Gas: గ్యాస్‌ సిలిండర్‌ వాడే వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. కొత్త సర్వీసులు అందుబాటులోకి..