SBI Customer Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌.. 3 రోజులు ఆ సర్వీసులన్నీ బంద్.. ఎందుకో తెలుసా..?

SBI Customer Alert: దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లను అలర్ట్ చేసింది. బ్యాంక్ సర్వీసులు మే 21, 22, 23 తేదీల్లో కొన్ని గంటలపాటు అందుబాటులో..

SBI Customer Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌.. 3 రోజులు ఆ సర్వీసులన్నీ బంద్.. ఎందుకో తెలుసా..?
Sbi Customer Alert
Follow us
Subhash Goud

|

Updated on: May 20, 2021 | 7:57 PM

SBI Customer Alert: దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లను అలర్ట్ చేసింది. బ్యాంక్ సర్వీసులు మే 21, 22, 23 తేదీల్లో కొన్ని గంటలపాటు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో కస్టమర్లు బ్యాంక్ సేవలు ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉండవో ముందే తెలుసుకోవడం మంచిది.

మెయింటెనెన్స్ కారణంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ వంటి సేవలు అందుబాటులో ఉండవని బ్యాంక్ వెల్లడించింది. మే 21న 22.45 గంటల నుంచి మే 22న 01.15 గంటల వరకు, అలాగే మే 23న 02.40 గంటల నుంచి 06.10 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని ఎస్‌బీఐ తెలిపింది. ఈ కారణంగా ఖాతాదారులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఎస్‌బీఐ సూచించింది. మీరు ఆన్‌లైన్‌లో ఏమైనా చెల్లింపులు నిర్వహించాల్సి ఉంటే ఈ సమయాలను తప్పించి కార్యకలాపాలను సెట్ చేసుకోవడం ఉత్తమం.

ఇవీ చదవండి

Indian Gas: గ్యాస్‌ సిలిండర్‌ వాడే వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. కొత్త సర్వీసులు అందుబాటులోకి..

SBI Zero Balance Account: ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ను ఓపెన్‌ చేయండిలా..? ఖాతా ఉపయోగాలు ఇలా..!