SBI Zero Balance Account: ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ను ఓపెన్‌ చేయండిలా..? ఖాతా ఉపయోగాలు ఇలా..!

SBI Zero Balance Account: బ్యాంకు అకౌంట్‌ ఓపెన్‌ చేయాలంటూ మినిమమ్‌ బ్యాలెన్స్‌ తప్పనిసరి. మినిమమ్‌ బ్యాలెన్స్‌ మెయింటైన్‌ చేయకపోతే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది...

SBI Zero Balance Account: ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ను ఓపెన్‌ చేయండిలా..? ఖాతా ఉపయోగాలు ఇలా..!
SBI Zero Balance Account
Follow us
Subhash Goud

|

Updated on: May 20, 2021 | 2:20 PM

SBI Zero Balance Account: బ్యాంకు అకౌంట్‌ ఓపెన్‌ చేయాలంటూ మినిమమ్‌ బ్యాలెన్స్‌ తప్పనిసరి. మినిమమ్‌ బ్యాలెన్స్‌ మెయింటైన్‌ చేయకపోతే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏ బ్యాంకు అయినా అకౌంట్‌కు మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఎంత ఉండాలో నిర్ణయిస్తుంది. ఆ బ్యాలెన్స్‌ మెయింటైన్‌ చేయకపోతే కస్టమర్ల నుంచి ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే ప్రతీ బ్యాంకులో మినిమమ్‌ బ్యాలెన్స్‌ అవసరం లేని బ్యాంకు ఖాతాలు ఉంటాయి. ఆ అకౌంట్‌నే బేసిక్‌ సేవింగ్స్‌ డిపాజిట్‌ అకౌంట్‌ (BSBD) అంటారు. లేదా జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌ అని పిలుస్తుంటారు. అంటే ఎలాంటి బ్యాలెన్స్‌ మెయింటైన్‌ చేయాల్సిన అవసరం లేని అకౌంట్‌ అని అర్థం. అయితే మీరు ఎస్‌బీఐలో బేసిక్‌ సేవింగ్స్‌ డిపాజిటి అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. ఈ ఖాతాల వల్ల ఎన్నో లాభాలున్నాయి.

ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కూడా బ్యాంకులు ఇలాంటి బ్యాంకింగ్ సేవలు అందింస్తుంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా ఈ అకౌంట్ అందిస్తోంది. బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్ (BSBD) తీసుకుంటే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఖాతాలో ఉన్న డబ్బులన్నీ డ్రా చేయవచ్చు. మీకు అవసరం ఉన్నట్టుగా వాడుకోవచ్చు. మీ బ్యాలెన్స్ మీ ఇష్టం. జీరో బ్యాలెన్స్ అకౌంట్‌పై ఇతర లాభాలు కూడా ఉన్నాయి. ఇతర అకౌంట్లకు ఉన్నట్టుగా ఛార్జీలు ఉండవు. అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు.

ఉచితంగా ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ లభిస్తుంది. డిపాజిట్లు, విత్‌డ్రాయల్ లాంటి సేవలు కూడా ఉచితం. ఈ అకౌంట్ ఆపరేట్ చేయకపోయినా, ఇనాపరేటీవ్‌గా ఉన్న అకౌంట్‌ని తిరిగి యాక్టీవ్ చేయాలన్నా ఛార్జీలు లాంటివి వసూలు చేయరు. అకౌంట్ క్లోజ్ చేయడానికి కూడా ఛార్జీలు ఉండవు. అయితే జీరో బ్యాలెన్స్ అకౌంట్‌లో నాలుగు ట్రాన్సాక్షన్స్ ఉచితం. అంటే నెలలో నాలుగు సార్లు ఎస్‌బీఐ ఏటీఎం లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంలల్లో ఉచితంగా డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అంతకన్నా ఎక్కువ సార్లు డబ్బులు డ్రా చేస్తే ఛార్జీలు వసూలు చేస్తాయి బ్యాంకులు. నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ సేవలు ఉచితం. ఇక రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌కు వర్తించినట్టుగానే జీరో బ్యాలెన్స్ అకౌంట్‌కు వడ్డీ ఉంటుంది. రూ.1,00,000 కన్నా ఎక్కువ డిపాజిట్లపై వార్షికంగా 2.70 శాతం పైనే వడ్డీ లభిస్తుంది. అన్ని ఎస్‌బీఐ బ్రాంచ్‌లల్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అయితే ఈ ఖాతా కోసం బ్యాంకుకు వెళ్లి, బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్(BSBD) ఫామ్ పూర్తి చేసి, కేవైసీ పూర్తి చేస్తే చాలు అకౌంట్‌ ఓపెన్‌ అయిపోతుంది. ఎలాంటి మినిమమ్‌ బ్యాలెన్స్‌ మెయింటైన్‌ చేయాల్సిన అవసరం ఉండదు.

ఇవీ కూడా చదవండి

SBI కస్టమర్లకు అలర్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంకు.. వర్కింగ్ టైమ్స్ మారాయి..ఆ సేవలు మాత్రమే అందుబాటులో..

Health Insurance: కరోనా సంక్షోభంలో పెరిగిన ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు.. 25-30 శాతం పెరిగిన బీమా ప్రీమియంలు..!

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే