Gold Hallmark: బంగారానికి హాల్‌మార్క్ త‌ప్ప‌నిస‌రి గ‌డువు మ‌రోసారి పెంపు.? వ్యాపారుల డిమాండ్‌పై ప్ర‌భుత్వం ఎలా..

Gold Hallmark: బంగారం నాణ్య‌త‌ను గుర్తించేందుకు ఉద్దేశించిన హాల్‌మార్క్‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. నిజానికి ఇది వరకు హాల్‌ మార్క్‌ పద్ధతి అమలు చేయాలని...

Gold Hallmark: బంగారానికి హాల్‌మార్క్ త‌ప్ప‌నిస‌రి గ‌డువు మ‌రోసారి పెంపు.? వ్యాపారుల డిమాండ్‌పై ప్ర‌భుత్వం ఎలా..
Gold Hallmark
Follow us
Narender Vaitla

|

Updated on: May 20, 2021 | 2:25 PM

Gold Hallmark: బంగారం నాణ్య‌త‌ను గుర్తించేందుకు ఉద్దేశించిన హాల్‌మార్క్‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. నిజానికి ఇది వరకు హాల్‌ మార్క్‌ పద్ధతి అమలు చేయాలని 2019లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం వ్యాపారుకులకు 2021, జనవరి 15 వరకు గడువు ఇచ్చింది. అయితే గతేడాది కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడం, లాక్‌డౌన్‌ కారణంగా బంగారం దుకాణాలు సైతం మూతపడడంతో ఈ గడువును పెంచాలని వ్యాపారులు కేంద్రాన్ని కోరారు. దీనికి ఓకే చెప్పిన కేంద్రం జూన్‌ 1 వరకు గడువు పొడగించింది. ఇక మ‌రోసారి ఈ తేదీని పెంచ‌బోమ‌ని ప్ర‌భుత్వం తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే హాల్‌మార్క్‌ను తాజాగా బంగారం వ్యాపారులు మ‌రో ఏడాది పొడ‌గించాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. క‌రోనా కార‌ణంగా వ్యాపారాలు త‌గ్గిపోయాయని, పాత బంగారు ఆభ‌ర‌ణాలు ఇంకా పూర్తిగా అమ్ముడిపోని ప‌రిస్థితుల్లో హాల్‌మార్క్‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తే త‌మ‌కు ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని వ్యాపారులు వాపోతున్నారు. డెడ్‌లైన్‌ను క‌నీసం ఏడాది పెంచాల‌ని కోరుతున్నారు. అంతేకాకుండా త‌మ స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవ‌డానికి ప్ర‌భుత్వం ఒక క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని వ్యాపారులు ప్ర‌భుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో బంగారు ఆభ‌ర‌ణాల‌కు హాల్ త‌ప్ప‌స‌రి తేదీని ప్ర‌భుత్వం మ‌రోసారి పెంచుతుందా.? లేదో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాలి.

Also Read: Pawan Kalyan: దూకుడు పెంచిన పవర్ స్టార్.. పవన్ కొత్త సినిమా కోసం భారీ కాలేజ్ సెట్..

Ragi Malt Health Benefits: రాగి జావ‌తో ఎన్ని లాభాలో.. మ‌రీ ముఖ్యంగా వేస‌విలో.. తెలిస్తే అస్స‌లు వ‌ద‌ల‌రు..

నాటు.. అదే రూటు..! పక్క రాష్ట్రాల నుంచి గుట్టుగా నాటుసారా ప్రవాహం.. పట్టుకున్న అధికారులు..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో