Ragi Malt Health Benefits: రాగి జావతో ఎన్ని లాభాలో.. మరీ ముఖ్యంగా వేసవిలో.. తెలిస్తే అస్సలు వదలరు..
Ragi Malt Health Benefits: ఒకప్పుడు ప్రజలు ఎక్కువగా రాగులను ఆహారంలో భాగం చేసుకునేవారు. అందుకే మన పెద్దలు అంత బలంగా ఆరోగ్యంగా ఉండేవారు. ఎన్నో పోషక విలువలు ఉండే రాగుల...
Ragi Malt Health Benefits: ఒకప్పుడు ప్రజలు ఎక్కువగా రాగులను ఆహారంలో భాగం చేసుకునేవారు. అందుకే మన పెద్దలు అంత బలంగా ఆరోగ్యంగా ఉండేవారు. ఎన్నో పోషక విలువలు ఉండే రాగుల ధర కూడా చాలా తక్కువే. అయితే మన పెద్దలు మనకు అందించిన ఈ పౌష్టిక ఆహారాన్ని మనం మరిచిపోయాం. తాజాగా సూపర్ మార్కెట్‌లలో రాగి మాల్ట్ పేరుతో మళ్లీ ఈ తరం వారికి రాగి మాల్ట్ చేరువవుతోంది. రాగి జావతో కలిగే అన్ని లాభాలు అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా వేసవిలో శరీరాన్ని చల్లగా మార్చే ఈ బెస్ట్ ఫుడ్‌ను ట్రై చేయాల్సిందే. మరి రాగి జావతో కలిగే ప్రయోజనాలపై ఓ లుక్కేయండి..
* రాగుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ప్రస్తుతం కరోనాను తరిమికొట్టడానికి వైద్యులు విటమిన్-సి తీసుకోమని సలహాలిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాగి జావ ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
* రాగుల్లో ఉండే ఐరన్ రక్త హీనతకు చెక్ పెడుతుంది. ఇది రక్తం ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రక్త హీనతతో బాధపడే వారు రాగులను ఏదో రూపంలో తీసుకోవాలి.
* రాగి జావ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు. కాబట్టి డయాబెటిస్ ఉన్న వారు కూడా రాగి జావను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
* రాగుల్లో ఉండే కాల్సియం ద్వారా ఎముకలు దృఢంగా మారుతాయి. మన పెద్దలు ఇంత దృఢంగా ఉండడానికి బహుశా ఇదే కారణం కావొచ్చు.
* రాగుల్లో ఉండే అమైనో ఆమ్లాలు ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలను తగ్గిస్తాయి.
* రాగులు జీవక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మలబద్ధకంతో ఇబ్బంది పడే వారు రాగి జావను ఆహారంలో భాగం చేసుకుంటే చాలా మంచిది.
మహిళలను ఎక్కువగా బాధిస్తున్న వెన్నునొప్పి సమస్య.. తగ్గించాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..