Alcohol: మందు బాబులూ.. మద్యం మంచికేననే భ్రమలో ఉన్నారా.? ఓ సారి ఈ వార్త చూడండి.. మెదడు దిమ్మ దిరుగుతుంది.
Consumption Of Alcohol: మద్యపానం ఆరోగ్యానికి హానికరమనే విషయం అందరికీ తెలిసిందే. మద్యం సేవించడం వల్ల శరీరంలోని అన్ని భాగాలపై ప్రభావం పడుతుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో...
Consumption Of Alcohol: మద్యపానం ఆరోగ్యానికి హానికరమనే విషయం అందరికీ తెలిసిందే. మద్యం సేవించడం వల్ల శరీరంలోని అన్ని భాగాలపై ప్రభావం పడుతుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. పలువురు నిపుణులు సైతం ఈ విషయాన్ని తేల్చిచెప్పారు. అయితే మద్యం ప్రియులు మాత్రం.. తమకు తాము సర్దిచెప్పుకుంటారు. కొంచెం మొత్తంలో మద్యం తాగితే ఆరోగ్యానికి మంచిదని ఫీలవుతుంటారు. అంతటితో ఆగకుండా ఇతరులకూ సలహాలిస్తుంటారు. అయితే ఎక్కువ మోతాదు, తక్కువ మోతాదు అనే తేడా లేకుండా ఎంత మద్యం తీసుకున్నా ఆరోగ్యానికి మంచిది కాదని తాజాగా అధ్యయనాల్లో వెల్లడైంది. మద్యం తీసుకునే పరిమాణంతో సంబంధం లేకుండా అది మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఇంగ్లండ్‌కు చెందిన సుమారు 25000 మందిపై పరిశోధనలు జరిపిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చారు. మద్యపానం మెదడు పనితీరుపై దుష్ప్రభావం చూపుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఈ విషయమై ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన సీనియర్ క్లినికల్ పరిశోధకులు అన్య టోపివలా మాట్లాడుతూ.. మద్యపానం కారణంగా మెదడులో ఏర్పడే సమస్యలతో మతిపరుపు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తక్కువ మోతాదులో మద్యం తీసుకున్నాఈ ప్రమాదం తప్పదని చెప్పుకొచ్చారు. ఇక వైన్, స్పిరిట్, బీర్ అనే తేడాలు లేకుండా ఎలాంటి మద్యమైనా మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందని అన్య పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా.. మద్యపానం కారణంగా బీపీ, ఒబేసిటీ వంటి ప్రమాదాలు కూడా ఉంటాయన్నారు. చూశారుగా మేము కొంచం మొత్తంలోనే మద్యం తాగుతాం.. సోషల్ డ్రింకర్స్ అనుకుంటున్న వాళ్లు కూడా జాగ్రత్త పడాల్సిందేనని ఈ అధ్యయనం చెప్పకనే చెబుతోందన్నమాట.
Also Read: పంతం వీడని ఇజ్రాయెల్-వెనక్కి తగ్గని హమాస్, పసిపిల్లల రోదనలతో ప్రతిధ్వనిస్తున్న గాజా